ప్రముఖ దర్శకుడు విజయబాపినీడికి అద్భుతమైన రచనా సామర్ధ్యం ఉండడమేకాదు .. సమయానుకూలంగా తన తెలివితేటల్ని ఉపయోగించి వ్యాపారం చేయగల సమర్ధత కూడా పుష్కలంగా ఉంది. ఆయన సినిమాల్లోకి రాకపూర్వం ‘విజయ’ అనే పత్రికను నడిపేవారు. ఆ పత్రికల్లో కూడా చాలా వైవిధ్యత చూపేవారు. ఆ తర్వాత ఆయన రచయితగా సినీ రంగంలోకి ప్రవేశించి.. ఎన్నో సినిమాలకు కథలు అందించి, ఆ తర్వాత దర్శకుడయ్యారు. అయితే ఆయన దర్శకుడిగా మారడానికి ముందు ..అంటే.. 1977, 1978 ప్రాంతాల్లో ఆయన రెండు సినిమాల్ని కలిపి ఒకే సినిమాగా విడుదల చేశారు. ఒక కన్నడ సినిమాని, ఒక మలయాళ సినిమాని డబ్బింగ్ చేసి.. వాటి నిడివి తగ్గించి ఒకే సినిమాగా విడుదల చేశారు. ఫస్టాఫ్ ఒక సినిమా సెకండాఫ్ ఒక సినిమా అన్నమాట. వారి పేర్లు ప్రేమ పూజారి, అహల్య. తెలుగు చిత్రపరిశ్రమలో ఈ తరహా ప్రయోగం ఇంతవరకూ ఎవరూ చేయకపోవడం విశేషం.

 

 

Leave a comment

error: Content is protected !!