అసలు.. సినిమాలకు లాజిక్ వెతక్కూడదని అంటారు. లాజిక్స్ వెతికితే .. ఏ సినిమానూ ఎంజాయ్ చేయలేమన్నది కొందరివాదన. అందుకే ఎలాంటి లాజిక్స్ కీ దొరక్కూడదని ఒకప్పటి లెజెండరీ డైరెక్టర్స్ అనుకొనేవారు. వారిలో బి.యన్.రెడ్డి ఒకరు. ఆయన సినిమాలు అత్యంత సహజంగానూ, కథలు అద్భుతం అనుకొనే రీతిలోనూ ఉంటాయి. ఆ తరహా సినిమానే ‘భాగ్యరేఖ’. యన్టీఆర్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా అప్పటి ప్రేక్షకుల్ని ఎంతగానే అలరించింది.
కథలో హీరోకి జబ్బు చేస్తుంది. క్రమేణ కోలుకుంటాడు. మామూలుగా అయితే, ఒక డిసాల్వ్ షాటు వేసి, హీరో మామూలు స్థితికి వచ్చినట్టు చూపిస్తారు. ‘భాగ్యరేఖ’ లో క్రమేణా కోలుకుంటున్నాడని చూపించడానికి, రోజులు గడుస్తున్న కొద్ది కాస్త కాస్త ముఖం వికసిస్తున్నట్టుగా చూపించారు. దానికి వాడిపోయిన ముఖాన్ని, మేకప్‌తో కొంచెం బ్రైట్ చేసి, మళ్లీ కొద్ది రోజులకి, మరికొంత బ్రైట్ చేసి – అలా అలా వికసించేలా తీశారు బి.ఎన్.రెడ్డి. దానికి దర్శకుడికీ, నటుడికీ శ్రద్ధ కావాలి, ఓపికా కావాలి. అది, అనాటి నిర్దిష్టత.