పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్ని మాస్ కేరక్టర్స్ చేసినా.. అభిమానులకు మాత్రం గబ్బర్ సింగ్ లోని పోలీస్ పాత్రే కళ్ళముందు ఇంకా కదలాడుతూ ఉంటుంది. ఆ పాత్రకు  ఆ స్థాయిలో మసలా అద్ది బ్లాక్ బస్టర్ కొట్టాడు హరీశ్ శంకర్ . అంతకు ముందు ‘గుడుంబా శంకర్’ లో  కాసేపు పోలీస్ గా కనిపించినా.. ఆ తర్వాత ‘సర్దార్ గబ్బర్ సింగ్’ లో ఫుల్ రోల్ లో నటించినా జనానికి కిక్ రాలేదు. అందుకే ఇప్పట్లో మళ్ళీ పోలీస్ గా రాకూడదనుకున్నాడు పవన్. అయితే మళ్ళీ పవన్ కు గబ్బర్ సింగ్ కేరక్టరైజేషన్ తో మరో కొత్త కథ రాసుకుని మళ్ళీ మ్యాజిక్ చేయా లనుకుంటున్నాడట.

పవర్ స్టార్ , హరీశ్ శంకర్ కాంబో లో మరో సినిమా రానున్నట్టు వార్తలొస్తున్న నేపథ్యంలో పోలీస్ గా మరోసారి పవన్ నటిస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం హరీశ్ శంకర్ ఆ పనిలోనే ఉన్నాడని సమాచారం. దబంగ్ బాలీవుడ్ సినిమా రీమేకే అయినా.. గబ్బర్ సింగ్  లో పవర్ స్టార్ కు వేరే మసాలా అద్ది.. అభిమానుల్ని ఖుషీ చేసిన హరీశ్ .. ఈ సారి దానికి రెండింతల వినోదాన్ని యాడ్ చేస్తున్నాడట. ప్రస్తుతం పవన్ కాప్ స్టోరీ మీద హరీశ్ శంకర్ సిరియస్ గా వర్క్ చేస్తున్నాడట. త్వరలోనే  ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానున్నదని వినికిడి. మరి పోలీస్ గా ఈ సారి పవన్ . హరీశ్ ఏ రేంజ్ సినిమా చేస్తారో చూడాలి.

Leave a comment

error: Content is protected !!