Shopping Cart 0 items - $0.00 0

పొలం పనులకు ‘శ్రీకారం’ చుట్టిన శర్వానంద్

టాలీవుడ్ వర్ధమాన యంగ్ హీరోల్లో విభిన్నంగా  సినిమాలు చేస్తూ ప్రత్యేకత చాటుకుంటోన్నాడు శర్వానంద్ . ఎర్లియర్ గా ‘రణరంగం’ తో  మెప్పించాడు. వచ్చేనెల్లో సమంతా సమేతంగా  ‘జాను’ మూవీతో రాబోతున్నాడు. ఇదిలా ఉంటే.. శర్వా ఇప్పుడు మరో కొత్త సినిమాకి  రెడీ అవుతున్నాడు.  సినిమా పేరు ‘శ్రీకారం’. కిశోర్ రెడ్డి బి అనే కుర్రోడు ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు.

ఈ రోజు ఉదయం ‘శ్రీకారం’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది 14 రీల్స్ ప్లస్ ఎంటర్ టైనర్స్ సంస్థ.  గళ్ళ లుంగీ పైకి ఎగదోపి.. పొలం గట్టుమీద నిలబడి శర్వానంద్ స్టైల్ గా నవ్వుతోన్న పోజుతో ఫస్ట్ లుక్ రివీలైంది. ‘ఇతను మన కేశవులు కొడుకు. పొద్దున్నే పొలం పనులకు వెళ్ళొస్తున్నాడు చూడండి’.. అనే కేప్షన్ తో పోస్టర్ రిలీజయింది.  మిక్కీజే మేయర్ సంగీతం అందిస్తోన్న ఈ మూవీ శర్వానంద్ కు 29 వ సినిమా. ఈ సమ్మర్ లో విడుదల కానున్న ‘శ్రీకారం’ శర్వాకు ఏ రేంజ్ ఇమేజ్ తెచ్చిపెడుతుందో చూాడాలి. 

Leave a comment

error: Content is protected !!