‘ఎఫ్2, గద్దలకొండ గణేశ్’ చిత్రాలు వరుసగా ఘన విజయం సాధించడంతో మంచి హుషారుగా ఉన్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ. ప్రస్తుతం స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో కిరణ్ కొర్రపాటి అనే కొత్త దర్శకుడితో ‘బాక్సర్’ మూవీని చేస్తున్నాడు. ఇవే కాకుండా మరికొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెట్టుకున్నాడు. అందరు యంగ్ హీరోలతో పాటు తాను కూడా మార్కెట్ పరిథిని విస్తరించుకొనే పనిలో ఉన్నాడు వరుణ్ బాబు. ఆ క్రమంలో మనోడికి బాలీవుడ్ లో డెబ్యూ చేయాలనే కోరికగా ఉందట. ప్రస్తుతం బాలీవుడ్ నుంచి పలు ఆఫర్స్ వస్తున్నా.. మంచి కథ కోసం ఎదురు చూస్తున్నానని.. అంటోన్నవరుణ్ .. తనకి కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ తో నటించాలని ఎప్పటి నుంచో కోరిక అని తన మనసులో మాట చెప్పాడు.
తనకి ఏదో ఒక రోజు షారూఖ్ ఖాన్ పక్కన నటించే అవకాశం తప్పకుండా వస్తుందని , ఆరోజు కోసం నేను ఎదురుచూస్తానని చాలా నమ్మకంతో చెబుతున్నాడు. ప్రస్తుతం తన సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నకారణంతోనూ, బాలీవుడ్ లో మంచి కథలు తన దగ్గరకు రాని కారణంగానూ ఇప్పట్లో బాలీవుడ్ లో నటించే అవకాశం లేదని.. మంచి పాయింట్ తో ఎవరైనా వస్తే.. అప్పుడు తన బాలీవుడ్ డెబ్యూ గురించి ఆలోచిస్తానని వరుణ్ తేజ వెల్లడించాడు. మరి వరుణ్ తేజ ను మెప్పించే మంచి కథ బాలీవుడ్ నుంచి ఎప్పుడొస్తుందో .. అతగాడు షారుఖ్ ఖాన్ తో స్ర్కీన్ షేర్ ఎప్పుడు చేసుకుంటాడో చూడాలి.