గాంధీనగర్, నెహ్రూ కోలనీ, సరోజినీ నాయుడు రోడ్, అంబేద్కర్ నగర్, రాజన్న సిరిసిల్ల, ప్రకాశం జిల్లా  లాంటి పేర్లు వింటూంటాం. అవన్నీ ఆయా వ్యక్తుల మీద గౌరవం తో పెట్టుకొన్న పేర్లే. అయితే వారంతా రాజకీయ పరంగానూ, వ్యక్తిత్వ పరంగానూ సమాజంలో పేరు ప్రఖ్యాతులు గడించినవారు. అయితే ఒక ఊరికి ఒక దర్శకుడి పేరు పెట్టడం ఎక్కడైనా చూశారా? అది షోలే దర్శకుడు రమేష్ సిప్పీ విషయంలోనే జరగడం విశేషం. భారతీయ చలన చిత్ర చరిత్రలోనే  ‘షోలే’ ఒక సంచలనం. అమితాబ్, ధర్మేంద్ర, హేమమాలిని, సంజీవ్ కుమార్ , అంజాద్ ఖాన్ లాంటి మహామహులు నటించిన అద్భుత చిత్రం అది.

ఈ సినిమాని బెంగళూరులోని రామ్‌నగరం అనే పట్టణం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. అక్కడ భారీగా ఉండే గ్రానైట్‌ రాళ్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అలాంటి ఓ ప్రాంతాన్నే గబ్బర్‌ సింగ్‌ దాక్కుని ఉండే డెన్‌గా చిత్రంలో చూపించారు. చిత్రీకరణ సమయంలో ఆ ఊరి ప్రజలకు చిత్రబృందంతో మంచి అనుబంధమేర్పడింది. తమ ఊరిలో తెరకెక్కిన ఆ చిత్రం మరపురాని విజయం సాధించడంతో వారు మురిసిపోయారు. అప్పుడే ‘షోలే’కు గౌరవసూచకంగా ఆ చిత్ర దర్శకుడు రమేష్‌ సిప్పీ పేరుమీదుగా తమ ఊరిలోని ఓ ప్రాంతానికి సిప్పీ నగర్‌ అని పేరుపెట్టుకున్నారు.

 

Leave a comment

error: Content is protected !!