Shopping Cart 0 items - $0.00 0

ట్రైలర్ టాక్ : మిస్టరీని ఛేదించే ‘అశ్వథ్థామ’

నాగశౌర్య హీరోగా కొత్త కుర్రోడు రమణ తేజ దర్శకత్వంలో ఐరా క్రియేషన్ బ్యానర్ లో నిర్మాణం జరుపుకున్న యాక్షన్ థ్రిల్లర్ ‘అశ్వథ్థామ’. ఈనెల 31న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోన్న ఈ సినిమా ట్రైలర్ ఈ సాయంత్రం రిలీజైంది . ఇదొక ఇంటెన్స్ థ్రిల్లరని ట్రైలర్ బిగినింగ్ లోనే అర్ధమవుతుంది. ‘రాక్షసుడ్ని, భగవంతుణ్ణి చూసిన కళ్ళు ఇక ఈ ప్రపంచాన్ని చూసే అర్హత కోల్పోతాయి’. అనే విలన్ వాయిస్ ఓవర్ మీద ట్రైలర్ బిగిన్ అవుతుంది. ఆ తర్వాత హీరో ఫ్యామిలీని రివీల్ చేస్తారు. కొంత మంది జాలర్లు దిగుతారు. దేని గురించో అన్వేషిస్తారు. ఆ తర్వాత ఒక పెద్దాయన ‘సార్.. నిన్న సాయంత్రం నుంచి మా అమ్మాయి ఇంటికే రాలేదు సార్’ .. అంటాడు. పోసాని పోలీస్ గెటప్ లో ఫోన్ చూస్తూనవ్వుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత అంతుచిక్కని కొన్ని సంఘటనలు ఒకదాని వెంట జరుగుతూ ఉంటాయి. హీరోఅన్వేషణ మొదలవుతుంది.

‘ఎటు వెళ్లినా మూసుకుపోతున్న దారులు, ఒకరితో ఒకరికి సంబంధం లేని వ్యక్తులు , వేటకుక్కల్లాగా వెంటపడే జాలర్లు . శకునిలాంటి ఒక ముసలోడు . వీళ్ళందరినీ ఒకే స్టేజ్ మీద ఆడిస్తోన్న ఆ సూత్రధారి ఎవరు? అంటూహీరో బుర్రబద్దలు కొట్టుకుంటాడు.అంతు చిక్కని రీతిలో ఆడపిల్లలందరూ ఒకదాని తర్వాత ఒకరు మర్డర్ చేయబడతారు. అందులో హీరో చెల్లెలు కూడా ఉంటుంది.  ఈ కేస్ ను  హీరో ‘అశ్వథ్థామ’ ఛాలెంజింగ్ గా తీసుకొని దానికి వెనుక ఉన్నదెవరో అన్వేషిస్తాడని అర్ధమవుతోంది. చూడ్డానికి ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది. దానికి గిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్  అద్బుతంగా కుదిరింది.  మొత్తం మీద  నాగశౌర్య ఈ సినిమాతో  గట్టిగా కొడతాడని అనిపిస్తోంది.  మరి తెరమీద అశ్వథ్థామ  ఏ రేంజ్ లో ఆకట్టుకుంటాడో చూడాలి.   

ట్రైలర్ కోసం కింది లింక్ ను క్లిక్ చేయండి

https://www.youtube.com/watch?v=JVMxgvKxPBs&feature=emb_logo

Leave a comment

error: Content is protected !!