అమితాబ్ బచ్చన్ కి ‘యాంగ్రీ యంగ్ మాన్’ ఇమేజ్ ని తెసుకువచ్చిన సినిమా ‘జంజీర్’. అసలు టోటల్ ఇండియన్ ఫిల్మ్ మేకింగ్ పై ప్రగాఢమైన ఇంపాక్ట్ చూపించిన సినిమా ఇది. సలీమ్-జావేద్ రాసిన స్క్రిప్ట్ ఇది. దీనికి బేస్ ఓ ఇటాలియన్ మూవీ. ‘Death Rides a Horse’ (Da uomo a uomo)(1967)(available in mxplayer)
ఫస్ట్ ధర్మేంద్ర హీరో.
కానీ, డేట్లు వెంటనే ఇవ్వలేనన్నాడు.
నెక్స్ట్- దేవానంద్ హీరో.
డ్యూయట్లు పెట్టాలన్నాడు.
ఆ నెక్స్ట్- రాజ్ కుమార్
మద్రాసులో షూటింగ్ చేయాలన్నాడు.
రాజేష్ ఖన్నా ఏమో రెజెక్టెడ్.
హీరోయిన్ మాత్రం ముంతాజ్ కామన్.
మరి హీరో ఎవరు?
‘బాంబే టూ గోవా’ సినిమా చూడామని దర్శక నిర్మాత ప్రకాష్ మెహ్రా కి చెప్పాడు ప్రాణ్.
అమితాబ్ బచ్చన్ వచ్చేశాడు.
ఇప్పుడు ‘జంజీర్’ లో హీరో అమితాబ్ బచ్చన్.
అతని పక్కన నేను చేయడమెంటాని ముంతాజ్ తప్పుకుంది.
జయ భాదురి వచ్చింది.
సినిమా తీస్తున్నత సేపు అమితాబ్ బచ్చన్ కి డౌట్.
సినిమా రిలీస్ అయిన మూడు రోజుల వరకు ప్రకాష్ మెహ్రా కి డౌట్.
ఆ తరువాత ‘జంజీర్’ ఒక హిస్టరీ.
బాక్స్ ఆఫీసు దగ్గర ఒక సునామీ.
‘జంజీర్’ అంటే ‘సంకెళ్ళు’ అని అర్ధం.
నిజం గానే ప్రేక్షకులు తమ గుండెల్లో అమితాబ్ బచ్చన్ కి ప్రేమ సంకెళ్ళు వేసి మరి బంధించేశారు.
తమాషా ఏమిటంటే సలీం-జావేద్ లకి ఒక ఐటం దొరికితే పది వంటకాలు చేసేయగలరు.
వాళ్లే స్క్రిప్ట్ రాసిన ‘యాదోo కీ బారాత్’ సినిమా చూడండి.
దగ్గర దగ్గర గా ‘జంజీర్’ పోలీకలతోనే ఉంటుంది.
ఇందులో అమితాబ్ బచ్చన్ పేరు ‘విజయ్’ ఆ పేరొక సెంటిమెంట్ అయిపోయింది.
‘జంజీర్’ ని బేస్ చేసుకునే తెలుగులో ఎన్టీఆర్ తో ‘నిప్పులాంటి మనిషి’ తీశారు ఎస్. డి లాల్.
1970 లో విజయ్ లలిత ప్రధాన పాత్రలో ‘రివాల్వర్ రాణి’ అనే సినిమా వచ్చింది.
ఆ సినిమా కాన్సెప్ట్ కూడా ‘Death Rides a Horse’ తరహాలోనే ఉంటుంది. ‘జంజీర్’ కన్నా ముందే వచ్చింది మూవీ. తమిళ, కన్నడ, హిందీ భాషల్లోకి కూడా డబ్ అయ్యింది.
సత్యం సంగీత దర్శకుడు.
‘జంజీర్’ ఇన్స్పిరేషన్ తో చాలా భాషల్లో చాలా సినిమాలోచ్చాయి. రాజశేఖర్ తో కోడి రామకృష్ణ తీసిన ‘అంకుశం’ కి మెయిన్ త్రెడ్ ఈ చిత్రమే.  ఇక ఇదే చిత్రాన్ని మలయాళంలో ‘నాయాట్టు’ పేరుతో రీమేక్ చేశారు. జయన్ హీెరో, ప్రేమ్ నజీర్ ప్రాణ్ పాత్రను పోషించారు. శ్రీకుమారన్ తంబీ దర్శకుడు.  వీటి తో పాటు ఈ ‘జంజీర్’ రీమేక్ తోనే రాంచరణ్ హిందీ సినీరంగ ప్రవేశం చేశారు .

Leave a comment

error: Content is protected !!