Shopping Cart 0 items - $0.00 0

యుగంధర్

 

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ డా. యన్టీఆర్ సినీ కెరీర్ లో ఓ ప్రత్యేకమైన చిత్రం ‘యుగంధర్’. 1979, నవంబర్ 30న విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించింది. శ్రీగజలక్ష్మీ ఆర్ట్స్ బ్యానర్ పై విద్యాసాగర్ నిర్మించిన ఈ సినిమాకు యాక్షన్ చిత్రాల దర్శకుడు కె.యస్.ఆర్. దాస్ దర్శకత్వం వహించారు. యన్టీఆర్ చిత్రాన్ని డైరెక్ట్ చేయడం ఆయనకి అదే మొదటి, చివరి చిత్రం. పోలీసుల్ని ముప్పతిప్పలు పెడుతోన్న మాఫియా డాన్ యుగంధర్ ను పట్టుకోవడానికి సిబిఐ రంగంలోకి దిగుతుంది. వాళ్ళకీ చిక్కినట్టే చిక్కి తప్పించుకుంటూ ఉంటాడు యుగంధర్. అయితే ఒకానొక టైమ్ లో పోలీసుల కాల్పుల్లో మరణిస్తాడు యుగంధర్. ఎవరికీ ఈ రహస్యాన్ని తెలియనీకుండా… అతడి స్థానంలో అదే పోలీకలతో ఉన్న విజయ్ ను.. యుగంధర్ లా శిక్షణనిచ్చి.. మాఫీయా సీక్రెట్స్ తెలుసుకోవడానికి నియమిస్తాడు యస్.పీ. జగన్నాథ్. చివరికి విజయ్ ఆ గ్యాంగ్ ను పోలీసులకు ఎలా పట్టించాడన్నదే మిగతా కథ. ఇక ఈ సినిమా అమితాబ్ హీరోగా నటించిన ‘డాన్’ హిందీ సినిమాకి రీమేక్ వెర్షన్. అమితాబ్ కు సూపర్ స్టార్ డమ్ తెచ్చిపెట్టిన చిత్రాల్లో డాన్ ఒకటి. బాలీవుడ్ లో సెన్సేషనల్ హిట్టయిన ఈ సినిమా  ఆ తర్వాత  తమిళంలో రజనీకాంత్ తో బిల్లాగానూ, మలయాళంలో మోహన్ లాల్ హీరోగా శోభరాజ్ గానూ రీమేక్ అయి అక్కడ కూడా దుమ్మురేపేసింది. ఇక యుగంధర్ చిత్రానికి మరో విశేషమేంటంటే… ఈ సినిమాకి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు. యన్టీఆర్ కు ఇళయరాజా సంగీతం అందించడం అదే ఫస్ట్ అండ్ లాస్ట్ . ఇందులోని పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్  అప్పటి ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాయి.

 

Leave a comment

error: Content is protected !!