తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం కోవిడ్ 19 సెకండ్ వేవ్ విజృంభణ తీవ్రమైన స్థాయిలో ఉంది. దానికి ఎవరు అతీతులు కాదన్నది నిజం. అలా ఇటీవల చాలా మంది సినీ ప్రముఖులు దాని భారిన పడి మరణించారు. తాజాగా తెలుగు చిత్రసీమకు చెందిన యువ దర్శకుడు కుమార్ వట్టి మృతి చెందారు. ఆయన శ్రీ విష్ణు హీరోగా నటించిన ‘మా అబ్బాయి‘ సినిమాతో దర్శకుడు గా పరిచయం అయ్యారు. కొన్నిరోజుల ముందు ఆయన కోవిడ్ ప్రభావంతో హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. పరిస్థితి విషమించడంతో ఈ శుక్రవారం తుది శ్వాస విడిచారు. కుమార్ మరణంతో తెలుగు పరిశ్రమ షాక్ కు గురైంది. కుమార్ వట్టి స్వస్థలం శ్రీకాకుళం జిల్లాలోని నర్సన్నపేట.