గతంలో వచ్చిన ‘యాత్ర’ సినిమా బ్లాక్‌బస్టర్ అయింది. దానికి కొనసాగింపుగా యాత్ర 2 తెరకెక్కుతోంది. ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మహి వి రాఘవ్ దర్శకుడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర 2004 ఎన్నికల్లో ఎలా విజయం సాధించిందో ‘యాత్ర’ సినిమా చూపించింది.

యాత్ర 2 మూవీ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఎదుగుదల చూపించబోతోంది. టీజర్ చూస్తే ఖచ్చితంగా ఆకట్టు కుంటోంది. రాజకీయ ప్రచారం స్పష్టంగా కనిపించినా, అవసరమైన ఎమోషన్‌ని రేకెత్తించడంలో మహి వి రాఘవ్ బాగా సక్సెస్ అయ్యాడు. జగన్‌ని ముఖ్యమంత్రి పీఠం ఎక్కకుండా అడ్డుకునేందుకు జరిగిన కుట్ర, రాజకీయ పోకడలు టీజర్‌లో కనిపిస్తాయి. మహేష్ మంజ్రేకర్ చంద్రబాబు నాయుడు పాత్రలో మెప్పించగా, మమ్ముట్టి వైఎస్ రాజశేఖర్ రెడ్డిగా అలవోకగా నటించారు. సోనియాగా సుజానే బర్నర్ట్ కనిపిస్తే, కేతకి నారాయణ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు.

ఇక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బాడీ లాంగ్వేజ్ ను బాగా పట్టుకున్నాడు జీవా. చేతి సైగలు, ముఖ కవళికలు, ఇతర నడవడికలు బాగున్నాయి. కొన్ని సున్నితమైన అంశాలను టచ్ చేస్తూ, ఎమోషన్‌ని చాలా చక్కగా మెయింటైన్ చేసింది టీజర్. అంచనాలు పెంచేసింది.

https://www.youtube.com/watch?v=Lx_Xu7CfgBw

Leave a comment

error: Content is protected !!