నటీనటులు: మమ్ముట్టి, జీవా, కేతకీ నారాయణ్, సచిన్ ఖేడ్కర్, మహేష్ మంజ్రేకర్ తదితరులు

రచన, దర్శకత్వం: మహీ వీ రాఘవ

నిర్మాత: మేక శివ

సినిమాటోగ్రఫి: మధీ

మ్యూజిక్: సంతోష్ నారాయణ్

ఎడిటర్: శ్రవణ్

బ్యానర్: త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్

02 రిలీజ్ డేట్: 2024-02-08

సినిమా అనౌన్స్‌మెంట్‌ దగ్గర్నుంచి రిలీజ్‌ వరకు అత్యంత ఆసక్తి రేకెత్తించిన సినిమా యాత్ర2 . ముఖ్యంగా ఆంధ్ర పాలిటిక్స్ హీట్‌లో ఉండటంతో జగన్‌ కు ఫేవర్‌గా తీస్తున్న సినిమాగా ఈ సినిమా ఎక్కువ క్యూరియాసిటీ క్రియేట్‌ చేసింది. జగన్‌ జీవితంలోని వార్తల్లో ఉన్న మెయిన్‌ హైలెట్స్‌ను ఎలా తీసారు.. సినిమాటిక్‌ లిబర్టీ తీసుకున్నారా.. అధికార, ప్రతిపక్షాల పాయింట్‌ ఆఫ్ వ్యూ ను జనాలకు ఎలా ప్రజెంట్‌ చేసారు.. ఓవరాల్‌గా జగన్‌ అభిమానులకే కాకుండా.. న్యూట్రల్ ఆడియెన్స్‌ను కూడా మెప్పించిందా అనేది ఈ రివ్యూలో చూద్దాం.

కథ : వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మరణానంతరం.. జగన్‌ సిఎం కావాలని సంతకాల సేకరణ, అధిష్ఠానం తిరస్కరించడం.. వైఎస్సార్ మరణంతో తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాల కోసం ఓదార్పు యాత్ర చేయాలని నిర్ణయించుకోవడం.. పార్ఠీ అధిష్ఠానం యాత్ర చేయొద్దని ఆదేశించడం.. జగన్‌ ధిక్కరించి యాత్ర చేపట్టడం.. అక్కడి నుంచి అక్రమ కేసులు జైలు జీవితం బయటకొచ్చిన తర్వాత నుంచి అధికారం చేపట్టేవరకు అందరికీ తెలిసిన కథే. ఈ కథను మహి వి రాఘవ ఎలా తీసాడనేది.. న్యూట్రల్‌ ఆడియెన్స్‌ని మెప్పించేలా తీసాడా లేదా అనేది తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ : చారిత్రక ఘటనలైనా.. పొలిటికల్‌ చరిత్రనైనా యాజ్‌ ఇట్‌ ఈజ్‌ గా సినిమా తీయాలంటే చాలా కష్టమైన పని. ఒక్కో సంఘటన ఒక్కొక్కరి పాయింట్‌ ఆఫ్ వ్యూలో వేర్వేరు కోణాలలో అర్ధం చేసుకుంటుంటారు. అదే నమ్ముతారు. ఇది వైఎస్‌ జగన్‌ పొలిటికల్‌ జీవితం ఆధారంగా తీస్తున్న సినిమా కాబట్టి జగన్‌కు అనుకూలంగానే సీన్లు ఎలివేషన్స్‌ ఇస్తారనేది తెలిసిందే. అయితే ఆయా సీన్లను న్యూట్రల్‌ ఆడియెన్స్‌ కూడా నమ్మేలా తీయడంలోనే మహి వి రాఘవ రీచ్‌ కావాల్సిన టార్గెట్‌ . చాలా వరకు దర్శకుడు ఆ టార్గెట్‌ రీచ్ అయ్యాడు కూడా. వాస్తవ సంఘటనలు కాకపోయినా జగన్‌ ఆలోచనా విధానం కు తగ్గట్టు కొన్ని సినిమాటిక్ లిబర్టీ తీసుకుని చేసామని డైరెక్టర్‌ ఓపెన్ గా చెప్పారు. అలాంటి సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటాయి. ఎప్పుడైతే సెకండాఫ్ కంప్లీట్ పొలిటికల్ రైవల్రీ స్టార్ట్ అవుతుందో కొత్తగా చెప్పాల్సిన పని లేకుండా పోయింది. దాంతో ఆసక్తి కలిగించే విధంగా కాకుండా కాస్త రెగ్యులర్‌ రొటీన్‌ రూట్లో వెళ్తుంది సినిమా. పాదయాత్రలో కీలకంగా వ్యవహరించిన షర్మిళ క్యారెక్టర్ ఉండదని ముందే చెప్పినా.. ఆ క్యారెక్టర్‌ లేకపోవడం ఓ వర్గానికి నిరాశనే కలిగిస్తుంది. మాటలు జగన్‌ ను ఎలివేట్ చేసే విధంగా రాసుకోవడం ఈ సినిమాకు మెయిన్‌ ప్లస్‌ పాయింట్. తండ్రి కొడుకుల మధ్య సన్నివేశాలు ఎమోషనల్‌ గా కదిలిస్తాయి.

నటీనటులు : ఆల్‌రెడీ వైఎస్సార్‌ గా మమ్ముట్టి ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ గా జీవా అద్భుతంగా నటించాడు. ఇంకా చెప్పాలంటే జీవించాడు కూడా. జగన్‌ బాడీలాంగ్వేజ్‌ను యాజ్‌ ఇట్‌ ఈజ్‌ ఇమిటేట్ చేయడం మాత్రమే కాకుండా ఆ పాత్ర కు రియల్ ఇమేజ్ ను ఎలివేట్ చేసే విధంగా జీవా చేసిన పర్‌ఫార్మెన్స్‌ కు హ్యాట్సాఫ్ చెప్పి తీరాల్సిందే. నందిగం సురేష్‌ క్యారెక్టర్‌ చేసిన కిశోర్‌కుమార్ పర్‌ఫార్మెన్స్‌ గుర్తిండిపోతుంది. ముఖ్యంగా కేవీపి పాత్రలో శుభలేఖ సుధాకర్‌ పాత్ర గుర్తుండిపోతుంది. భారతీరెడ్డి పాత్ర పోషించిన కేతకి నారాయణ్‌, విజయమ్మ పాత్ర, చంద్రబాబుగా మహేష్‌ మంజ్రేకర్‌లు పరిధి మేరకు చక్కగా నటించారు.

బోటమ్‌లైన్‌ : యాత్ర 2 పొలిటికల్‌ ఫీల్‌గుడ్‌ జర్నీ

రేటింగ్ : 3 / 5

Leave a comment

error: Content is protected !!