టైటిల్ : యాద్గిరి & సన్స్
నటీనటులు : అనిరుధ్, యశస్విని, రోహిత్, జీవా, రాజీవ్ కనకాల, మధుమణి, నాగరాజ్, మోతీలాల్
సంగీతం: విజయ్ కురాకుల,
డి.ఓ.పి: శ్రీను బొడ్డు,
ఎడిటింగ్: మార్తాండ్. కె. వెంకటేష్,
పి.ఆర్.ఓ: బి. వీరబాబు
కో డైరక్టర్: అమర్నాథ్ కొత్తూరు,
నిర్మాత: చంద్రకళ పందిరి,
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: భిక్షపతి రాజు పందిరి
రియల్ ఇన్సిడెంట్స్‌తో సినిమాలు తీయడం కొత్తేం కాదు. మర్డర్ మిస్టరీస్, ఇన్విస్టిగేటివ్ థ్రిల్లర్స్ ను తెలుగు తెరపై ఎన్నో చూసాం. ఇలాంటి జోనర్ కు మినిమమ్ గ్యారెంటీ ఆదరణ ఉంటుంది. అలాంటి జోనర్‌లో వచ్చిందే యాద్గిరి అండ్ సన్స్. మర్డర్ మిస్టరీకి సంబంధించిన వాస్తవ సంఘటనతో తీసిన ఈ సినిమా పై టీజర్ ట్రైలర్‌లతో ఆడియెన్స్‌లో ఆసక్తి క్రియేట్ అయ్యింది. మరి అందుకు తగ్గట్టే సినిమా ఉందా.. ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
హైదరాబాద్ సిటీలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో బ్రతికే ఆటోవాలా యాద్గిరి (జీవా). ఇతనికి ఇద్దరు కొడుకులు లక్ష్మణ్ , వెంకట్. పెద్దకొడుకు లక్ష్మణ్ తాగుబోతు. చిన్నకొడుకు వెంకట్ (అనిరుధ్) కంపెనీలో జాబ్ చేస్తూంటాడు. కొంచెం కొంచెంగా డబ్బు కూడబెట్టి ఇంటిని పోషిస్తూనే.. తన లవర్ స్వాతి (యశస్విని) బర్త్‌డేకి గిఫ్ట్ ఇచ్చే ప్లాన్ లో ఉంటాడు. అది కాస్తా లక్ష్మణ్ కంట పడుతుంది. తాగుడు కోసం వెంకట్ డబ్బులు కాజేస్తాడు. అది తెలిసి వెంకట్ లక్ష్మణ్ తో గొడవ పడతాడు. మాటా మాటా పెరిగి పోట్లాటకు దారితీస్తుంది. ఈ కొట్లాటలో లక్ష్మణ్ కు వెంకట్ కొట్టిన దెబ్బ బలంగా తగిలి చనిపోతాడు. వెంకట్‌ను పోలీసులు అరెస్ట్ చేస్తారు. లాయర్ రాజీవ్ కనకాల సాయంతో బెయిల్ పై బయటపడతాడు. తండ్రి ఇంట్లోనుంచి వెళ్లగొడతాడు. అక్కడి నుంచి తన అన్న మరణానికి తాను కొట్టిన దెబ్బలు కాదని ఇంకేదో ఉందని వెతికే ప్రయత్నం చేస్తాడు. వెంకట్ తన అన్న చావుకు అసలు కారణం తెలుసుకున్నాడా..? అసలు మిస్టరీ ఏంటనేది బిగ్‌స్క్రీన్ పై చూడాల్సిందే.
విశ్లేషణ :
నాలుగేళ్ల క్రితం ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ వచ్చింది. మర్డర్ మిస్టరీ ని ఛేదించడంతో పాటు ఎంటర్‌టైన్ చేయడంలోనూ ఈ సినిమా ఓ మార్క్ క్రియేట్ చేసింది. ఇప్పుడు యాద్గిరి అండ్ సన్స్ విషయంలోనూ ఇలాంటి లైనే కనిపిస్తుంది. కథ వాస్తవ సంఘటనల ఆధారమే అయినా.. కథనంలో సినిమాటిక్ లిబర్టీని పర్‌ఫెక్ట్ గా వాడుకుంటేనే అద్బుతమైన థ్రిల్లర్స్ వెండితెరపై దర్శనమిస్తాయి. ఆడియెన్స్‌ని సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడతాయి. యాద్గిరి అండ్ సన్స్ విషయంలో బడ్జెట్ పరిధి పరిమితమని తెలిసిపోతూనే ఉంటుంది. అయినా తన పరిధిలో మర్డర్ మిస్టరీని చివరి వరకు ఎంగేజ్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. ఎందుకోసం మర్డర్ జరిగిందనేది తెలిస్తే.. డబ్బు కోసం మనుషుల్లో ఇంత కసాయితనం పెరిగిందా అని అనిపిస్తుంది. టెలివిజన్ న్యూస్ చూసినపుడో, పేపర్స్ చదివినప్పుడో ఎన్నో సార్లు మనకు కలిగిన ఎమోషన్ ను తెరమీద చూస్తున్నపుడు కూడా కలిగిస్తేనే ఆ సినిమా సక్సెస్. అలా చూసుకుంటే ఈ యాద్గిరి అండ్ సన్స్ చాలా వరకు సక్సెస్ అనే చెప్పాలి.
సాంకేతిక విభాగం : దర్శకత్వ ప్రతిభ, స్క్రీన్‌ప్లే మేజిక్, ఆర్టిస్ట్‌ల పర్‌ఫార్మెన్స్ , బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మర్డర్ మిస్టరీ లకు ప్రధాన బలం. ఈ శాఖలన్నీ చాలా వరకు ఆడియెన్స్ ని థ్రిల్ చేయడంలో తమ వంతు న్యాయం చేసారనే చెప్పాలి. ఇన్విస్టిగేటివ్ థ్రిల్లర్‌లకు లాజిక్ లు కీ పాయింట్స్. అది ఆడియెన్స్ కన్విన్స్ అయ్యేలా చూపించాలి. కొంత వరకు ఈ విషయంలో నిరాశ పరుస్తుంది యాద్గిరి అండ్ సన్స్. మర్డర్ ఎందుకు జరిగిందో తెలిసాక ఆడియెన్స్ కు గూస్‌బంప్స్ వచ్చేలా చేసాడు దర్శకుడు. అయితే క్లైమాక్స్ మాత్రం సింపుల్ గా తేల్చేసినట్టు అనిపిస్తుంది.
బాటమ్ లైన్ : యాద్గిరి అండ్ సన్స్
రేటింగ్ : 2.75