నిజ జీవిత ఘటనలను తెరకెక్కించడం ఈజీనే.. కానీ ప్రేక్షకులను ఒప్పించేలా రూపొందించడం అంత ఈజీ కాదు. సినిమాటిక్‌ లిబర్టీ తీసుకుంటూనే యధార్ధ సంఘటనల తాలూకూ ఎమోషన్స్‌ ను పండించాలి. అలాంటి సినిమానే యాద్గిరి అండ్‌ సన్స్‌. ఈ పేరు చూస్తే కామెడీ సినిమా ఫ్లేవర్ కనిపిస్తుందేమో కానీ.. అన్ని రకాల ఎమోషన్స్‌ ను బ్యాలెన్స్‌ చేస్తూ.. కమర్షియల్‌ బాక్సాఫీస్‌ రేస్‌కు తగ్గట్టు రూపిందించారు దర్శకుడు బిక్షపతి రాజు పందిరి. ఈ చిత్రాన్ని చంద్రకళ పందిరి నిర్మించారు. అనిరుధ్‌, యశస్విని మెయిన్‌ లీడ్‌ చేసారు. ఈ చిత్రం ప్రీరిలీజ్‌ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు భీమ్లానాయక్‌ దర్శకుడు సాగర్‌ కె చంద్ర ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ప్రీరిలీజ్‌ వేడుకలో చిత్ర ట్రైలర్‌ను రిలీజ్‌ చేసారు సాగర్‌ చంద్ర.
రియల్ ఇన్సిడెంట్స్‌తో ఇటువంటి సినిమాని రూపొందించడం గ్రేట్. చాలా మంచి అటెంప్ట్ చేశారు. మంచి అటెంప్ట్‌ని, మంచి కంటెంట్‌ని సపోర్ట్ చేయాల్సిన బాధ్యత అందరిపై ఉంది. మంచి కంటెంట్ బేస్డ్ సినిమాని భిక్షపతి రాజుగారు తీశారని టీమ్‌కి బెస్ట్ విషెస్ అందించారు సాగర్‌ కె చంద్ర.
ప్రీరిలీజ్‌ వేడుకతో పాటు ట్రైలర్‌లాంచ్ చేసిన సాగర్‌ చంద్రకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు దర్శకులు భిక్షపతిరాజు అండ్ టీమ్‌. ఈ చిత్రాన్ని మే 5 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ చేస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!