టైటిల్: రైటర్ పద్మభూషణ్
క్యాస్ట్: సుహాస్, టీనా శిల్పారాజ్, శ్రీ గౌరీ ప్రియ, ఆశిష్ విద్యార్థి, రోహిణి, రమణ గోపరాజు తదితరులు….
పీఆర్వో: వంశీ – శేఖర్
మ్యూజిక్ డైరెక్టర్: శేఖర్ చంద్ర & కళ్యాణ్ నాయక్
సినిమాటోగ్రాఫర్: వెంకట్ ఆర్ శఖమూరి
ఎడిటర్: కొదటి పవన్ కళ్యాణ్, సిద్ధార్ద్ తాతోలు
ప్రొడ్యూజర్స్: చంద్రు/లహరి మ్యూజిక్, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర/ఛాయ్ బిస్కెట్
రైటర్ & డైరెక్టర్: షణ్ముఖ ప్రశాంత్
యూట్యూబ్ లో స్టార్ గా ఎదిగిన సహజ నటుడు సుహాస్ ఇప్పుడు హీరో గా రెండో సినిమాతో “రైటర్ పద్మభూషణ్” అంటూ ఈ రోజు థియేటర్ లో మనముందుకొచ్చారు. షణ్ముఖ్ ప్రశాంత్ దర్శకత్వంలో ఛాయ్ బిస్కెట్ అనురాగ్ & శరత్ ప్రొడ్యూజర్స్ గా తెరకెక్కించిన ఈ చిత్రం ప్రీమియర్స్ కి ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభించింది. మరి, ఈ చిత్రం ఏ స్థాయిలో ప్రేక్షకులని ఆకట్టుకుందో కథ లోకి వెళదాం..
కథ:
పద్మభూషన్(సుహాస్) విజయవాడలో ఒక అసిస్టెంట్ లైబ్రేరియన్. ఎప్పటికైనా గొప్ప రైటర్ కావాలని కల. తనకున్న సామర్థ్యంతో ‘తొలి అడుగు’ అనే ఒక పుస్తకాన్ని రాస్తాడు. కానీ ఆ విషయాన్నీ తన తండ్రి మధుసూధన్(అశిష్ విద్యార్థి), తల్లి సరస్వతి(రోహిణి) చెప్పకుండ అప్పుచేసి పుస్తకాన్ని పబ్లీష్ చేస్తాడు. కానీ ఆ పుస్తకం కొనుగోలు అవ్వదు. ఆ నిరుత్సాహంతో ఉచితంగా బుక్స్ ఇస్తాడు. ఆ ప్రయత్నం కూడా విఫలం అవ్వుతుంది. మరి, పద్మభూషణ్ రైటర్ పద్మభూషణ్ గా ఎలా మారాడు? తనకి తెలియకుండానే ఫెమస్ ఎలా అయ్యాడు? తన మరదలు సారిక(టీనా శిల్పారాజ్) ఎలా తన టాలెంట్ ని బయటపెట్టింది? అసలు ఆ బుక్ రాసింది పద్మభూషణ్ నేనా ఇవన్నీ తెలియాలి అంటే మీరు కచ్చితంగా సినిమా థియేటర్ లో చుడాలిసింది?
కధనం, విశ్లేషణ:
చిత్రం ఓపెన్ అవ్వగానే విజయవాడ లో బుక్స్ ప్రాముఖ్యత గురించి వివరించిన విధానం స్క్రీన్ మీద ఆకట్టుకుంటుంది. సుహాస్ ని ఒక అసిస్టెంట్ లైబ్రెరియన్ గా చూపించిన యాంగిల్ చాలా న్యాచురల్ గా పక్కింటి అబ్బాయిలా కనిపిస్తాడు. కొన్ని సీన్స్ లో సుహాస్ యాక్టింగ్ చూసి నాని టైమింగ్ గుర్తొస్తుంటుంది. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చాలా సరదాగా సాగిపోతుంది. పద్మభూషణ్ ఎంతగానో ఇష్టపడే తన మరదలతో పెళ్లి ఫిక్స్ కావడం. వీళ్లిద్దరి మధ్య సాగే కామిడి, లవ్ అండ్ కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. ఈ సినిమా లో కామిడి తో పాటు ఎమోషన్స్ కూడా ఉంటాయి. ఆడియన్స్ ని నవ్విస్తూనే ఏడిపిస్తాడు రైటర్ పద్మ భూషణ్. దర్శకుడు షణ్ముఖ్ ప్రశాంత్ ఫ్యామిలీ ని ఆకట్టుకునేలా అన్ని రకాల ఎమోషన్స్ ని తీర్చిదిద్దాడు. ముఖ్యంగా, స్క్రీన్‌ప్లే, ట్విస్ట్‌లతో కథనం కొత్తగా సాగుతుంది. గొప్ప రైటర్‌గా పేరు తెచ్చుకోవాలని ఆశపడే పద్మభూషణ్. ఖర్చులన్నీ పోగా నెలకు 8000 మిగిలితే చాలు అనుకునే తండ్రి మధు సూదనరావు. హౌస్ వైఫ్‌గా ఇంటిపని చేసే తల్లి సరస్వతి, ఇలా వీళ్ళ పాత్రల చుట్టే సాగుతుంది ఈ సినిమా. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోవడమే కాకుండా సెకండాఫ్‌పై ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేస్తుంది.
కొత్త పుస్తకం రాసిన తరువాతే పెళ్లి అన్నట్టు మామ(రమణ గోపరాజు) లింక్ పెట్టడంతో సెకండాఫ్‌లో పద్మభూషణ్ కొత్త పుస్తకం రాసేందుకు తగ కష్టాలు పడుతుంటాడు. క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకుల గుండెను బరువెక్కిస్తాయి. కొన్ని సంవత్సరాల తరువాత ఇలాంటి ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా థియేటర్ లోకి రావడం విశేషం. దర్శకుడు ఎంచుకున్న పాయింట్, తీసిన విధానం తెరపై అద్భుతంగా చూపించాడు. సో, మీరు మీ ఫ్యామిలీ తో తప్పకుండ చూడాలిసిన సినిమా. కాకపోతే, ఒక చిన్న మనవి ట్విస్ట్ లు, రివీల్ చేయకుండా సినిమా చూసి హాయిగా ఎంజాయ్ చెయ్యండి.
నటి నటుల పెర్ఫామెన్స్: అనతి కాలంలోనే కమల్ హాసన్ అంతటి నటుడు అవ్వుతాడని పేరు తెచ్చుకున్న సహజ నటుడు హీరో సుహాస్. ఈ సినిమాలో తనదైన స్టైల్ లో హాస్యం, ఎమోషన్స్, ఇన్నోసెన్స్ ని ఎంతో బ్యాలెన్స్ గా స్క్రీన్ మీద కనబరిచారు. హీరోయిన్స్ టీనా శిల్పారాజ్ మరదలు క్యారెక్టర్ లో ఓదిగిపోయింది, కొన్ని సీన్స్ లో ఔరా అనిపించేలా యాక్టింగ్ చాలా సెట్టిల్డ్ గా చేసింది. అలాగే శ్రీ గౌరీ ప్రియా కన్నా క్యారెక్టర్ లో చాలా చక్కగా రాణించింది. ఇకపోతే, ఆశిష్ విద్యార్థి తన పరిధి మేరకు అద్భుతంగా నటించారు. రోహిణి గారి పాత్ర ఈ సినిమాకి ఎంతో కీలకం.
సాంకేతిక విభాగం: డైరెక్టర్ షణ్ముఖ ప్రశాంత్ కామిడి టైమింగ్ తో పాటు, కొన్ని హుక్ పాయింట్స్ చక్కగా డెలివరీ చేస్తూనే ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా గా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడు. కళ్యాణ్ నాయక్ & శేఖర్ చంద్ర ఇచ్చిన మ్యూజిక్ ఈ సినిమా ని మరో స్థాయి కి తీసుకెళ్లాయి. డీఓపీ వెంకట్ ఆర్ షకమూరి పనితీరు బాగుంది. ఎడిటింగ్ చేసిన పవన్ కళ్యాణ్ చాలా చక్కటి నైపుణ్యాన్ని కనబరిచారు. చాయ్ బిస్కెట్ ప్రొడక్షన్ వాల్యూస్ స్క్రీన్ మీద చాలా గ్రాండియర్ గా ఉన్నాయి.
రేటింగ్: 3.75/5
బాటమ్ లైన్: అమ్మకి అంకితం ఈ “రైటర్ పద్మభూషణ్” చిత్రం.
రివ్యూ బై: తిరుమలశెట్టి వెంకటేష్