GOAT movie : కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘ది గోట్’ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) సినిమా సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. టాలెంటెడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పోస్టర్లు ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టు కున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా “విజిల్ ఏస్కో” పాటను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఈ చిత్రంలో విజయ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుండగా, జయరామ్, ప్రశాంత్, స్నేహ, లైలా, యోగిబాబు, వీటీవీ గణేష్, అజ్మల్ అమీర్, మైక్ మోహన్, వైభవ్, ప్రేమి, అజయ్ రాజ్, అరవింద్ ఆకాష్ తదితర నటులు కీలక పాత్రల్లో నటించారు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై అర్చన కల్పాతి, కల్పతి ఎస్ అఘోరమ్, కల్పాతి ఎస్ గణేష్, కల్పాతి ఎస్ సురేష్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.

Leave a comment

error: Content is protected !!