RC 16 : ఆర్ ఆర్ ఆర్ మూవీ సెన్సేషనల్ హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం నటిస్తున్న “గేమ్ చేంజర్”తో పాటు, “ఉప్పెన” దర్శకుడు బుచ్చిబాబు నానతో కలిసి సినిమా చేయనున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనుండటంతో చరణ్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
అయితే.. దీని మధ్య ఒక నెగటివ్ కూడా ధ్వనిస్తోంది. తెలుగులో రెహమాన్ డైరెక్ట్ గా స్వరాలు సమకూర్చిన సినిమాలు ఆడిన దాఖలాలు లేవు. డబ్బింగ్ సినిమాలకు గుర్తుండిపోయే ఆల్బమ్స్ చేసినప్పటికీ, “సూపర్ పోలీస్,” “నాని,” “కొమరం పులి,” “సాహసం శ్వాసగా సాగిపో” లాంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం పొందాయి.
అద్భుతమైన స్వరాలకు పేరొందిన రెహమాన్,.. ఇప్పుడు తెలుగు సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకోబోతున్నారు. చరణ్ సినిమా విషయానికొస్తే, అభిమానులు రెహమాన్ బ్లాక్‌బస్టర్ ఆల్బమ్‌ని అందిస్తారని, గతంలో జరిగిన దానికి భిన్నంగా సక్సెస్ సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా క్రీడా నేపథ్యంలో సాగే డ్రామా అని, చరణ్ క్రీడాకారుడి నుంచి కోచ్‌గా మారే పాత్ర పోషిస్తారని తెలుస్తోంది. ప్రాజెక్ట్ ప్రారంభం అవుతున్న దశలో, ఒక ప్రశ్న మాత్రం మిగిలిపోయింది. తెలుగులో ఏఆర్ రెహమాన్‌కు ఇదొక కొత్త ప్రారంభం అవుతుందా?