ప్రధాన పాత్రలో దర్శకుడు అహిషోర్‌ సల్మాన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘వైల్డ్‌ డాగ్‌’. అన్వేష్‌ రెడ్డి నిర్మించారు. దియా మిర్జా, సయామీ ఖేర్‌ కథానాయికలుగా నటించారు. ఎన్‌ఐఏ (నేషనల్‌ ఇన్వెస్టిగేటివ్‌ ఏజెంట్‌) ఆఫీసర్‌ విజయ్‌ వర్మ పాత్రలో నాగార్జున కనిపిస్తారు. ఈ సినిమా ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రాన్నుంది. ఈ సందర్భంగా సినిమాకి సంభందించిన ట్రైలర్స్ తో పాటు ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఈ మేకింగ్ వీడియోలో నటినటునులతో పాటు టెక్నిషియన్స్ తమ అనుభవాలను సినిమాకి పడిన కష్టం గురించి వివరించారు. ఆ లోకేషన్స్ లో షూట్ చేయడం, ముఖ్యంగా రద్దీగా ఉండే లోకేషన్స్ లో షూట్ చేయడం వంటి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. దర్శకుడు అహిషోర్‌ సల్మాన్‌ ప్రతి ఒక్క విషయాన్ని రీసర్చ్ చేసి మరి సినిమాను తెరకెక్కించారని చెప్పారు. ఆ ఇంట్రెస్టింగ్ వీడియోను మీరు చూసేయండి.

Leave a comment

error: Content is protected !!