అహిషోర్ సోలోమన్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటించిన వైవిధ్యమైన చిత్రం ‘వైల్డ్ డాగ్’. ఈ చిత్రంలో దియా మీర్జా, సయామీ కేర్, అతుల్ కులకర్ణి, ఆలీ రెజా, బిలాల్ హుస్సేన్, ప్రకాష్ సుదర్శన్, మయాంక్ ప్రకాష్, రుద్ర ప్రదీప్, అనీష్ కురువిళ్ళ, కెసి శంకర్, షవ్వార్ అలీ, అవిజిత్ దత్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రం ఏప్రిల్ 2న విడుదలకానుంది.
దర్శకుడు అహిషోర్ సోలోమన్ మీడియాతో మాట్లాడుతూ…
ఈ సినిమాను నిజానికి తొలుత ఓటీటీలో విడుదల చేయాలనుకున్నాం. కరోనా కారణంగా సినిమాకు ప్రేక్షకులు రారని భయపడ్డాం. కానీ ‘క్రాక్’ సినిమా 50 శాతం సీటింగ్ ఉన్నాకూడా సినిమా కలెక్షన్స్ ప్రేక్షకుల ఆదరణ చూసి ధైర్యం వచ్చింది. ఇప్పుడు సినిమాను నేరుగా థియేటర్లలోనే విడుదల చేయడానికి సిద్ధమవుతున్నామని చెప్పారు.
ఇటువంటి సినిమాకి సౌండ్ ఎఫ్ఫెక్ట్స్ & బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా అవసరం. సౌండ్ నాగార్జున తాల్లపల్లి చాలా బాగా చేశాడు. తమన్ ఈ సినిమాకి పెద్ద అస్సెట్ ట్రైలర్ చూశారు కదా సినిమా మొత్తం కూడా అలానే అదిరిపోతుంది.
కథ పరంగా నేపాలి వెళ్ళాం. కొన్ని రెస్క్యు సీన్స్ అనేవి థాయిలాండ్ లో చేద్దామనుకున్నాం. పాండమిక్ వల్ల క్యాన్సలై ముందు అబ్రాడ్ అనుకుని అటునుండి సిక్కిం వెళ్దామను కుంటే స్టేట్ అంతా లాక్ డౌన్. ఇప్పుడు ఎలా అనుకున్న పరిస్థితుల్లో షూటింగ్ స్టార్ట్ అని అనౌన్స్మెంట్ రాగానే హిమాచల్ ప్రదేశ్ కి వెళ్ళాం. మాకు అక్కడ చాలా మంచి లోకేషన్స్ దొరికాయి.
నాగార్జున లాంటి స్టార్ హీరో అంటే చాలా సినిమాలు చేసిన అనుభవం పైగా వైవిధ్యమైన సినిమాలు కూడా చేసి ఉన్నారు. ఆయనతో ఇటువంటి సినిమా అనగానే తన చుట్టూ ఉండే పాత్రలు ఫ్రెష్ ఫేసెస్ పరిచయం ఉన్న లేకున్నా గానీ తీసుకోవాలనే ఆలోచన కలిగింది. అందుకే దాదాపుగా కొత్త వారిని తీసుకోవడం జరిగింది. అలీరాజా ను అలానే ఎంపిక చేసుకోవడం జరిగింది. తన కోసం నన్ను నాగార్జున బిగ్ బాస్ షో చూడమని చెప్పారు. కానీ నాకు ఆ ఎందుకో ఆ షో అంతగా ఎక్కదు. అసలు ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదు. యూట్యూబ్ లో చూసి తనని తీసుకోవడం జరిగింది.
ఈ సినిమా చూస్తున్నప్పుడు నాగార్జున కాకుండా ఆ పాత్రైన విజయవర్మ ను ఆడియన్స్ చూడాలి అంటే చుట్టూ ఉండే లోకేషన్స్ గానీ, వారి కాస్ట్యూమ్స్ పాటు వాడే ఆయుధాలు కూడా రియలిస్టిక్ గా అనిపించాలి. అందుకే కొన్ని నిజమైన ఆయుధాలను కూడా వాడాం సినిమాలో. వాటిని ఎలా పట్టుకోవాలి అనే దానిపై నటి నటులకు శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది.
సినిమా నాగార్జునతో కాబట్టే సినిమాలో సాంగ్స్ అనేవి లేకుండా అడ్వెంచర్ మూవీగా తీయడం సాధ్యపడింది. ఈ సినిమా ట్రైలర్ చూశాక హింది పరిశ్రమ నుండి కూడా మంచి ప్రసంశలు వచ్చాయి. రూతంగ్ పాస్ లో హ్యుజ్ యాక్షన్ సీక్వెన్స్ చేసేటప్పుడు 14 వేల అడుగుల ఎత్తులో భరించరాని చలిలో 4 రోజులు షూటింగ్ చేశాం. ఫారెస్ట్ ఏరియాలో కూడా సుమారుగా ఒకటినర రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి ఇలాంటి వాటన్నిటికి సహకరించిన నాగార్జున సర్ కి ఆల్ ది క్యాస్ట్ అండ్ క్రూ తో పాటు సినిమాకి పనిచేసిన లేబర్ వర్కర్లకు కూడా చాలా థ్యాంక్స్ అని తెలిపారు.