Kalki 2898 AD :  మైథాలజీ అండ్  సైన్స్ ఫిక్షన్ చిత్రం “కల్కి 2898 ఏడీ” నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలై, బాక్సాఫీస్‌ వద్ద యునానిమస్ గా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ప్రభాస్, దీపికా పడుకున్, దిశా పటాని, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ వంటి ప్రముఖ నటీనటులతో నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఈ చిత్రంలోని కొన్ని పాత్రలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా కృష్ణుడి పాత్ర. ఈ పాత్రలో నటించిన యువకుడు అదరగొట్టడంతో ఆ నటుడు ఎవరా అని ప్రేక్షకులు ఆరా తీస్తున్నారు. అతని పేరు కృష్ణ కుమార్. గతంలో చాలా మంచి చిత్రాల్లో నటించాడు. సూర్య నటించిన “ఆకాశం నీ హద్దురా” చిత్రంలో అతను చేసిన పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ చిత్రంలోని నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు కూడా. మరి ఈ సినిమా తో కృష్ణ కుమార్ కు ఏ రేంజ్ లో అవకాశాలు వచ్చి పడతాయో చూడాలి.

Leave a comment

error: Content is protected !!