సత్యరాజ్‌, వసంత్‌రవి,తాన్యా హోప్‌ మెయిన్‌ లీడ్‌తో గుహన్‌ డైరెక్షన్‌లో మిలియన్ స్టూడియో నిర్మిస్తున్న మూవీ వెపన్‌. ఈ సినిమా టీజర్‌ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్ర ప్రెస్‌మీట్ హైదరాబాద్‌లో జరిగింది.

మార్వెల్ తరహా సినిమాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. అలాంటి థ్రిల్లింగ్ యాక్షన్‌ సీక్వెన్స్‌తో పాటు చక్కని మెసేజ్ ఇచ్చే సినిమా వెపన్అంటున్నారు యాక్టర్‌ సత్యరాజ్. కథ చెప్పినపుడు వంద కోట్ల సినిమా అనిపించింది. వీళ్లెలా డీల్‌ చేస్తారో అనుకున్నాను కానీ అద్భుతంగా తీసారంటూ డైరెక్టర్‌ గుహన్‌ ను మెచ్చుకున్నాడు. గుహన్‌ నా శిష్యుడే వసంత్‌ తో కలిసి వచ్చి కథ నేరేట్ చేసాడంటూ చెప్పుకొచ్చారు సత్యరాజ్‌.

తెలుగులో అల్లు అర్జున్‌,రామ్‌చరణ్ , మహేష్‌ బాబు లాంటి స్టార్ హీరోలందరూ తనకు ఇష్టమేననిజైలర్‌లాంటి పాత్రలు చేయాలనుందని చెప్పారు వసంత్ రవి.

వెపన్‌ మేకింగ్ విషయంలో మిలియన్‌ స్టూడియో సంపూర్తిగా స్వేచ్చ ఇచ్చి కాంప్రమైజ్‌ కాకుండా ఖర్చుపెట్టడం వల్లే ఇంత గొప్పగా సినిమా తీయగలిగామని చెప్పారు డైరెక్టర్‌ గుహన్‌. ఈసినిమాను కేరళలోని వామగన్‌లో తీసామని, యాక్టర్స్‌ అందరూ రిస్క్‌ తీసుకుని అద్భుతంగా నటించారని చెప్పారు. యాక్ట్రెస్‌ తాన్యా హోప్ ఈ సినిమాలో కీలకమని మెచ్చుకున్నారు.

వెపన్‌ వంటి సినిమా చేయడం అంత సులభం కాదు.. ఈ చిత్రాన్ని యాక్టర్స్‌, టెక్నిషియన్స్ అంతా డెడికేటెడ్‌గా పనిచేయడం వల్లే ఈ ఔట్‌ పుట్‌ వర్కవుట్ అయ్యిందన్నారు రాజీవ్‌ పిళ్లై.

Leave a comment

error: Content is protected !!