War 2 : బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రాలలో ‘వార్-2’ ఒకటి. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ నుండి వస్తున్న ఈ యాక్షన్ చిత్రంలో హృతిక్ రోషన్‌తో పాటు టాలీవుడ్ స్టార్ హీరో జూ.ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఈ సినిమాపై నార్త్, సౌత్ భారతదేశం అంతటా భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పటికే షూటింగ్ ప్రారంభించిన చిత్ర యూనిట్ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించడానికి సిద్ధమవుతోంది. ఈ షెడ్యూల్ దాదాపు నెల రోజుల పాటు జరుగుతుందని తెలుస్తోంది. ఆగస్టు 18 నుండి జూ.ఎన్టీఆర్ ఈ షెడ్యూల్‌లో షూటింగ్‌లో పాల్గొంటారని వార్తలు వినిపిస్తున్నాయి. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. 2025లో ఈ సినిమాను విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు లక్ష్యంగా పెట్టుకున్నారు.

Leave a comment

error: Content is protected !!