Wamika Gabbi : ది ఫ్యామిలీ మ్యాన్’ , ‘గన్స్ అండ్ గులాబ్స్’ వంటి సూపర్ హిట్ వెబ్ సిరీస్‌లను తెరకెక్కించిన బాలీవుడ్ దర్శకనిర్మాతలు రాజ్ & డీకే తమ తాజా ప్రాజెక్ట్‌గా ‘రక్తబ్రహ్మాండ్’ అనే యాక్షన్ ఫాంటసీ వెబ్ సిరీస్‌ను ప్రకటించారు. ‘ది బ్లడీ కింగ్’ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ సిరీస్‌కు రాహి అనిల్ బార్వే దర్శకుడు.

ఈ వెబ్ సిరీస్‌లో అందాల తారలు సమంత , వామిక గబ్బి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సిరీస్‌ చిత్రీకరణను వామిక మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ యాక్షన్ ఫాంటసీ ప్రపంచంలోకి అడుగుపెట్టిన వామిక తన పాత్ర కోసం శిక్షణ కూడా తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సిరీస్‌ షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ఈ సిరీస్‌లో ఆదిత్య రాయ్ కపూర్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.

Leave a comment

error: Content is protected !!