Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి 156వ చిత్రంగా , బింబిసార ఫేమ్ వశిష్ట తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం “విశ్వంభర”. త్రిష హీరోయిన్ గా నటిస్తు్న్న ఈ సినిమా నుంచి అభిమానులకు ఒక సర్ ప్రైజ్ అందింది. చిరంజీవి జన్మదినం సందర్భంగా ఈ రోజు చిత్రం నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ ను వదిలారు మేకర్స్.

ఈ పోస్టర్‌లో చిరంజీవి త్రిశూలం పట్టుకొని అత్యంత శక్తివంతమైన రూపంలో కనిపిస్తున్నారు. మునుపు విడుదలైన ప్రీ-లుక్ పోస్టర్‌లో కనిపించిన పోర్టల్ ముందు నిలబడి, త్రిశూలంతో శక్తిని ప్రదర్శిస్తున్నారు. ఈ పోస్టర్ మెగా ఫ్యాన్స్‌ను ఉత్సాహంగా నింపింది. ఈ భారీ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రం నిర్మించబడుతుంది. విశ్వంభర సినిమా 2024 సంక్రాంతి కానుకగా జనవరి 10న గ్రాండ్‌గా విడుదల కానుంది. మరి ఈ సినిమా చిరుకు ఏ రేంజ్ లో పేరు తెస్తుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!