Vishwam trailer : మ్యాచో స్టార్ గోపీచంద్ , శ్రీను వైట్ల మొదటి కాంబినేషన్ లో తెరకెక్కిన యాక్షన్ కామెడీ చిత్రం “విశ్వం”. దసరా కానుకగా అక్టోబర్ 11న విడుదల కానున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి అదిరిపోయే ట్రైలర్ ను వదిలారు మేకర్స్. ట్రైలర్‌లోని యాక్షన్ సన్నివేశాలు, కామెడీ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

“విశ్వం” చిత్రం ఒక యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కినట్టు ట్రైలర్ ను బట్టి అర్ధమవుతోంది. గోపీచంద్ సరి కొత్త పాత్రలో కనిపించనున్నాడు. ట్రైలర్‌లోని కొన్ని సన్నివేశాలు చూస్తుంటే, కథలో కొన్ని సస్పెన్స్ ఎలిమెంట్స్ కూడా ఉండే అవకాశం ఉంది. యాక్షన్ ప్లస్ ఎంటర్ టైన్ మెంట్ కలగలిసిన శ్రీను వైట్ల మార్క్ చిత్రం గా తెరకెక్కింది. డబుల్ ఇస్మార్ట్ ఫేమ్ కావ్యా థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది. విశ్వం చిత్రం ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రేక్షకులు ట్రైలర్‌ను బాగా ఆదరిస్తున్నారు. ముఖ్యంగా శ్రీను వైట్ల మార్క్ కామెడీ మరియు గోపీచంద్ యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Leave a comment

error: Content is protected !!