Vishwaksen :  యూత్ స్టార్ విశ్వక్ సేన్‌ తన కొత్త చిత్రం ‘లైలా’తో మరోసారి అందరిని ఆశ్చర్య పరచడానికి రెడీ అవుతున్నాడు. రామ్ నారాయణ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో విశ్వక్‌ అబ్బాయిగా, అమ్మాయిగా రెండు పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలోని ఒక ఆకట్టుకునే గీతాన్ని రామోజీ ఫిల్మ్‌సిటీలో చిత్రీకరించారు.

విశ్వక్‌ సేన్‌తో పాటు పలువురు డ్యాన్సర్లు ఈ గీతంలో అద్భుతంగా అభినయించారు. భాను మాస్టర్‌ నృత్య దర్శకత్వం వహించిన ఈ పాట ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుందని చిత్ర యూనిట్‌ తెలిపింది. ఈ సినిమాలో విశ్వక్‌ పాత్ర ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుందని కూడా వారు చెప్పారు. సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 14న విడుదల చేయాలని చిత్ర యూనిట్‌ ఇప్పటికే ప్రకటించింది.

Leave a comment

error: Content is protected !!