Vishwaksen : టాలెంటెడ్ యాక్టర్ విశ్వక్ సేన్ మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించే ఈ చిత్రానికి “లైలా” అనే ఆసక్తికరమైన టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు జూలై 3న ఉదయం 9.30 గంటలకు జరగనున్నాయి.

ఈ చిత్రంలో విశ్వక్ సేన్ ‘లైలా’ అనే అమ్మాయి పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. సీనియర్ నరేష్ చిత్రం భళారే విచిత్రం, రాజేంద్ర ప్రసాద్ మేడమ్ చిత్రాల తరహాలో ఈ మూవీ ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకులు తనిష్క్ బాగ్చి, గిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” తర్వాత విశ్వక్ సేన్ నటిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటుల వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.

Leave a comment

error: Content is protected !!