Vishwaksen : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో యువ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్, ఈ ఏడాది ‘గామి’ మరియు ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా ‘గామి’ సినిమా కమర్షియల్ సక్సెస్ సాధించింది. ఇక ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’లో విశ్వక్ సేన్ పోషించిన నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రకు మంచి ఆదరణ లభించింది. ప్రస్తుతం విశ్వక్ సినిమాల లైనప్ మామూలుగా లేదు.

ప్రస్తుతం రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం రవితేజ ముళ్ళపూడి దర్శకత్వంలో రూపొందింది. అక్టోబర్ 31న థియేటర్లలో విడుదల కానుంది. మీనాక్షి చౌదరి ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. రామ్ నారాయణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ‘బట్టల రామస్వామి’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన రామ్ నారాయణ, ‘లైలా’తో బిగ్ స్క్రీన్‌పై తనకంటూ మార్క్‌ను ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

VS14 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విశ్వక్ సేన్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ డ్రామాతో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ‘జాతి రత్నాలు’ ఫేమ్ కెవి అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. అవుట్‌ అండ్‌ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా కథాంశం ఉంటుందనే టాక్ వినిపిస్తోంది.

‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ఫేమ్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో మరో సినిమా కూడా విశ్వక్ సేన్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. విశ్వక్ సేన్ ప్రస్తుతం కమిట్ అయిన మూడు చిత్రాలు 2025లో ప్రేక్షకుల ముందుకు రావచ్చనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. తన కెరీర్‌లో వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. 2025లో విశ్వక్ సేన్ నుంచి వరుస సినిమాలు రానుండటంతో ఆయన ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!