Vishwaksen : తెలుగు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించిన ‘జాతి రత్నాలు’ , ‘ప్రిన్స్’ వంటి చిత్రాల దర్శకుడు అనుదీప్ కెవి తన తదుపరి చిత్రాన్ని యూత్ స్టార్ విశ్వక్ సేన్ చేస్తుండడంతో అందరిలోనూ ఆసక్తి కలుగుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం.
నిజానికి అనుదీప్ మొదట మెగాస్టార్ చిరంజీవికి ఒక కథ చెప్పారు. ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజతో ఒక సినిమా చేయడానికి ఒప్పందం కుదిరింది. అయితే చివరి నిమిషంలో రవితేజ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో అనుదీప్ మళ్లీ ఖాళీ అయ్యాడు . రవితేజ తప్పుకున్న వెంటనే అనుదీప్ విశ్వక్ సేన్‌తో కలిసి పనిచేయడానికి నిర్ణయించుకున్నారు.
ఇది పూర్తి కుటుంబ కథా చిత్రంగా రూపొందనుంది. విశ్వక్ సేన్ నటిస్తున్న 14వ చిత్రమిది. టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమ్స్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తారు. విశ్వక్ సేన్ ప్రస్తుతం ‘మెకానిక్ రాకీ’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం అక్టోబర్‌లో విడుదల కానుంది.
‘మెకానిక్ రాకీ’ తర్వాత అనుదీప్ సినిమా సెట్స్‌పైకి వెళ్లొచ్చు. అనుదీప్ కెవి , విశ్వక్ సేన్ కలయికతో తెరకెక్కనున్న ఈ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలు నెలకొన్నాయి. అనుదీప్ కెవి కామెడీ టైమింగ్, విశ్వక్ సేన్ నటన ఈ చిత్రానికి మరింత బలాన్ని చేకూర్చుతాయని భావిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వంటి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటంతో ఈ చిత్రంపై మరింత ఆసక్తి పెరిగింది.