ఈ నగరానికి ఏమైంది, ఫలక్ నుమా దాస్’ లాంటి చిత్రాలతో వైవిధ్యమైన కథానాయకునిగా టాలీవుడ్ లో ఎస్టాబ్లిష్ అయ్యాడు యంగ్ హీరో విష్వక్ సేన్. రీసెంట్  గా హిట్ చిత్రంతో ఘన విజయం సొంతం చేసుకున్న ఈ హీరో.. ఇప్పుడు మరో వెరైటీ మూవీకి కమిట్ అయ్యాడు. సినిమా పేరు ‘పాగల్’. లక్కీ మీడియా బ్యానర్ పై బెక్కం వేణుగోపాల్ నిర్మిప్తోన్న ఈ సినిమాకి నరేశ్ కుప్పిలి దర్శకుడు.

‘పాగల్’ చిత్రం ఈ రోజు హైద్రాబాద్ లో పూజా కార్యక్రమాలతో మొదలైంది.  జెమిని కిరణ్ స్విచ్చాన్ చేయగా, నక్కిన త్రినాథరావు ఫస్ట్ షాట్ కు దర్శకత్వం వహించారు. దిల్ రాజు స్ర్కిప్ట్ హ్యాండ్ ఓవర్ చేశారు, దగ్గుబాటి రానా క్లాప్ కొట్టారు. విష్వక్ సేన్ 5వ చిత్రంగా నిర్మాణం జరుపుకోనున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్ళనుంది.

Leave a comment

error: Content is protected !!