లాస్టియర్ ‘అయోగ్య, యాక్షన్’ చిత్రాలతో మిశ్రమ ఫలితాలు అందుకున్నాడు తమిళ యాక్షన్ హీరో విశాల్. ప్రస్తుతం అతడో యాక్షన్ అడ్వెంచర్ మూవీతో రాబోతున్నాడు. సినిమాకి చక్ర అనే టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్ . లాక్ డౌన్ కు ముందు సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమాకి యమ్.యస్.ఆనందన్ దర్శకుడు. త్వరలోనే షూటింగ్ పున: ప్రారంభించబోతున్నారు. ఈ రోజు  ఈ సినిమాలోని విశాల్ మాస్ యాక్షన్ స్టిల్ ను ఫస్ట్ లుక్ గా విడుదల చేశారు.

చూస్తుంటే ఈ సినిమాలో యాక్షన్ యాంగిల్ గట్టిగానే ఉన్నట్లు అర్ధమవుతోంది. ‘చక్ర’ అనే కేరక్టర్  హైలెట్ చేసేలా ఫస్ట్ లుక్ లో తన ఆయుధాన్ని కూడా చూపిస్తున్నాడు విశాల్ . నేడు రిలీజ్ చేసిన ఈ సినిమా పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెజీనా హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను విశాల్ నిర్మిస్తున్నాడు.

Leave a comment

error: Content is protected !!