చిత్రం: విశాల్‌ ‘చక్ర’

నటి నటులు: విశాల్, శ్రద్ధా శ్రీనాథ్, రెజీనా కసండ్రా, కె.ఆర్‌. విజయ, మనోబాల తదితరులు

సంగీతం: యువన్‌ శంకర్‌ రాజా

కెమేరా: కె.టి. బాలసుబ్రమణ్యం

ఎడిటింగ్‌: త్యాగు

నిర్మాణం: విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ

రచన & దర్శకత్వం: ఎం.ఎస్‌. ఆనందన్‌

రిలీజ్‌: 19-02-2021

తెలుగు తమిళ భాషల్లో మంచి మార్కెట్ సొంతం చేసుకున్న హీరో విశాల్. సైబ‌ర్ క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థాంశాల‌కు ప్రేక్ష‌కుల్లో మంచి ఆద‌ర‌ణ ఉంది. ఇంతకముందు సైబర్ నేపధ్యంగా వచ్చిన అభిమన్యుడు సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అదే తరహాలోనే విశాల్ ‘చక్ర’ కూడా రూపొందింది. కొనుగోళ్ళ దగ్గర నుంచి ఇంటి సర్వీసుల దాకా ప్రతీది ఆన్‌లైన్, ఇంటర్నెట్‌ బేస్డ్‌ అయిపోయాక డిజిటల్‌ ప్రపంచంలో మన సమాచారం అంతా ఇట్టే లీకయ్యే ప్రమాదం తలెత్తింది. వైరస్‌ కన్నా వైర్‌లెస్‌ నెట్‌వర్క్‌ ప్రమాదమైందనే అంశాన్ని తీసుకొని, హ్యాకింగ్‌ను జతచేసి, క్రైమ్‌నూ, ఇన్వెస్టిగేషన్‌నూ కలిపి చేసిన సినిమా ఇది.. విశాల్ దీన్ని స్వయంగా నిర్మించ‌డంతో దీనిపై అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఇక అభిమన్యుడు సినిమా తరహాలో విశాల్ చక్ర తో విజయం పొందాడా లేడా అనేది చూడాలి.

కథ:

ఆగష్టు 15న హైదరాబాద్ లో ఒకేసారి పలు చోట్ల 50 దొంగతనాలు జరుగుతాయి. అందులో మిలిటరీలో పని చేస్తున్న చంద్రు(విశాల్) ఇంట్లోని వాళ్ళ ఫాదర్ కి చెందిన అశోక చక్ర మెడల్ ని కూడా దొంగతనం చేస్తారు. దాంతో చంద్రు మిలిటరీ నుంచి వచ్చేసి తన ఫాదర్ మెడల్ ని దొంగిలించిన వాళ్ళ నుంచి వెతికి పట్టుకోవాలనుకుంటాడు. అందులో భాగంగా ఆ కేసు డీల్ చేస్తున్న గాయత్రి(శ్రద్ధ శ్రీనాథ్) టీంలో జాయిన్ అవుతాడు. ఇక అక్కడి నుంచీ చంద్రు తన టాలెంట్ తో ఆ దొంగతనాల వెనకున్న మాస్టర్ మైండ్ ని ఎలా పట్టుకున్నాడు? పట్టుకునే ప్రక్రియలో ఆ దొంగ నుంచీ చంద్రు అండ్ గాయత్రి టీం ఎదుర్కొన్న సవాళ్ళు ఏమిటి? వాటిని ఎలా ఛేదించి దొంగని పట్టుకున్నారు? ఆ దొంగ అన్ని దొంగతనాలు ఒకేసారి చేయడానికి గల కారణం ఏమిటి? అనేదే ఈ సినిమా కథ.

కథ విశ్లేషణ:

సినిమా క‌థ క‌థ‌నాలు, విశాల్ రోల్ సినిమా నడిచే తీరు చూస్తున్న‌ప్పుడు చ‌క్ర ఆద్యంతం అభిమ‌న్యుడుకి సీక్వెల్‌లాగే క‌నిపిస్తుంది. అయితే ఎంచుకున్న సైబ‌ర్ క్రైం క‌థాంశం కాస్త భిన్న‌మైన‌ది అంతే. ఈ డిజిట‌ల్ యుగంలో ఆన్‌లైన్ షాపింగ్‌లు, టెలీకాలింగ్ సంస్థ‌లు, ఇత‌ర‌త్రా ఆన్‌లైన్ లావాదేవీల ద్వారా పౌరుల వ్య‌క్తిగ‌త స‌మాచారం అనేది ఎలా దుర్వినియోగం అవుతుంది, దాని వ‌ల్ల ప్ర‌స్తుతం ప్ర‌తి ఒక్క‌రూ ఎలాంటి సైబ‌ర్ నేరాల బారిన ప‌డుతున్నారు అనే అంశాలను ఆక‌ట్టుకునేలా చెప్పే చేసిన ప్ర‌య‌త్నమే ‘చక్ర’. సినిమాను ప్రారంభిస్తూనే ప్రేక్ష‌కుల్ని క‌థ‌లోకి తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు. తొలి స‌న్నివేశంలోనే న‌గ‌రంలో వరుస చోరీలు జ‌ర‌గ‌డం.. ఈ క్రమంలో వారిని ప‌ట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగడం.. ఈ క్లిష్ట‌మైన కేసును ఛేదించేందుకు ఏసీపీ గాయ‌త్రిని రంగంలోకి రావడం. ఆమె వెన‌కాలే చంద్రు ఆ కేసులో భాగం కావ‌డం ఇలా కథ వేగంతో ప‌రుగులు పెడుతుంది. ఆ త‌ర్వాత విశాల్ త‌న తెలివితేట‌లు ఉప‌యోగించి కేసులోని చిక్కుముడుల‌ను ఒక్కొక్కటిగా విప్ప‌డం త‌ర్వాత డ‌య‌ల్ యువ‌ర్ హెల్ప్ అనే యుటిలిటీ స‌ర్వీస్‌ని ఆధారం చేసుకొని తెర వెనుక నుంచి ఓ సైబ‌ర్ క్రిమిన‌ల్ ఈ దాడికి పాల్ప‌డుతున్న‌ట్లు గుర్తించ‌డం వంటి స‌న్నివేశాల‌తో ప్ర‌థమార్ధాన్ని ఆస‌క్తిక‌రంగా తీర్చిదిద్దాడు. స‌రిగ్గా విరామ స‌మ‌యానికి ఈ నేరం వెనుక లీలా ఉన్న‌ట్లు చూపించి ప్రేక్ష‌కుల్లో ఓ ఆస‌క్తిని రేకెత్తించే ప్ర‌య‌త్నం చేశాడు. ఇక ద్వితీయార్ధంలో వచ్చే లీలా నేప‌థ్యం‌, విశాల్ ఆమెను ప‌ట్టుకునేందుకు చేసే ప్ర‌య‌త్నాలు, ఈ క్ర‌మంలో ఒక‌రికొక‌రు వేసే ఎత్తులు పై ఎత్తులు చూపించారు. అయితే ఇద్ద‌రి మ‌ధ్య పోరు సాదాసీదాగా సాగ‌డం మ‌ధ్య మ‌ధ్య‌లో వ‌చ్చే సాగ‌తీత స‌న్నివేశాల‌తో ద్వితీయార్ధం పేల‌వంగా కొనసాగుతున్న‌ట్లు అనిపించింది. ముఖ్యంగా సినిమా ముగింపు అనేది ప్రేక్ష‌కుల స‌హ‌నానికి ప‌రీక్ష పెట్టేలా అనిపించింది. ఇంటర్వెల్‌ తర్వాత హీరో-విలన్‌ మధ్య ఎత్తుకు పైఎత్తులు అనేవి ఆశించిన స్థాయిలో లేకపోవడం తో ప్రేక్షకుడు కాస్త నిరాశకు గురికాక తప్పదు.

నటీనటుల పెర్ఫార్మెన్స్:

విశాల్ మ‌రొక‌సారి శ‌క్తిమంత‌మైన మిల‌ట‌రీ అధికారిగా త‌న‌దైన శైలిలో మెప్పించాడు. కేసుని ఛేదించే క్ర‌మంలో ఆయ‌న వేసే ఎత్తులు.. యాక్ష‌న్ స‌న్నివేశాల్లో ఆయ‌న న‌ట‌న‌, చెప్పే సంభాష‌ణలు అంద‌రిని ఆక‌ట్టుకుంటాయి. ఏసీపీ గాయ‌త్రిగా శ్ర‌ద్ధా చ‌క్క‌టి అభిన‌యాన్ని చూపించింది. తెర‌పై త‌న అంద‌చందాల‌తో మాయ చేస్తూనే అక్క‌డ‌క్క‌డా యాక్ష‌న్ స‌న్నివేశాల్లోనూ అద‌ర‌గొట్టింది. సినిమా టీజర్స్, ట్రైలర్స్ లో చూపించకుండా ఉంచిన పాత్ర రెజీనా కాసాండ్ర. నెగటివ్ షేడ్స్ లో రెజీనా సూపర్బ్ పెర్ఫార్మన్స్ చేసింది. ముఖ్యంగా సెకండాఫ్ లో విశాల్ రెజీనా మధ్య వచ్చే సీన్స్ లో ఇద్దరు పోటీపడేలా సన్నివేశాలు ఉంటాయి. కె ఆర్ విజయ మరియు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. టెక్నీషియన్స్ పనితనం: సంగీత ద‌ర్శ‌కుడు యువ‌న్ శంక‌ర్ రాజాను గురించి మొద‌ట‌గా చెప్పుకోవాలి. ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌కి త‌న నేప‌థ్య సంగీతంతో కావాల్సినంత బ‌లాన్ని అందించాడు. స్పెషల్ గా హీరో కి విలన్ కి స్పెషల్ గా చేసిన ట్యూన్స్ చాలా బాగున్నాయి. ఇక టెక్నికల్ టీమ్ అనేది చక్ర సినిమాకి బ్యాక్ బోన్ అని చెప్పచ్చు. కెటి బాలసుబ్రమణ్యం సినిమాటోగ్రఫీ బాగుంది. ఒక యాక్షన్ థ్రిల్లర్ ఫీల్ ని బాగా క్యారీ చేసాడు. ఆ విజువల్స్ కి మరితం బలం చేకూర్చి సినిమాకి రిచ్ లుక్ తీసుకొచ్చాడు త్యాగి ఎక్కడా లాగ్ లేకుండా షార్ట్ అండ్ క్రిస్ప్ గా సినిమాని కట్ చేయడం ఒక ప్లస్ పాయింట్. విశాల్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

చివ‌రిగా: ‘చక్ర’ వ్యూహం నుండి బయటపడని విశాల్

‘చక్ర’ రేటింగ్-3/5

Leave a comment

error: Content is protected !!