చిత్రం: ‘విరూపాక్ష’
నటి నటులు: సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్, సోనియా సింగ్, రవి, అజయ్, రాజీవ్ కనకాల, సునీల్, బ్రమ్మాజి, యాంకర్ శ్యామల, తదితరులు
ఎడిటర్: నవీన్ నూలి
సంగీతం: అజనీష్ లోకానాధ్
ఛాయాగ్రహణం: శ్యామ్ దత్
స్క్రీన్ ప్లే: సుకుమార్
నిర్మాత: బీవీ.ఎస్.ఎస్. ప్రసాద్, సుకుమార్, భోగవల్లి బాపినీడు,
రచన, దర్శకత్వం: కార్తిక్ వర్మ దండు
విడుదల తేదీ: ఏప్రిల్ 21 2023
సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్, వరుస హిట్స్ తో దూసుకెళ్తున్న సంయుక్త మీనన్ హీరో హీరోయిన్ గా తెరకెక్కిన లేటెస్ట్ మిస్టిక్ థ్రిల్లర్ చిత్రం ‘విరూపాక్ష’. ఈ మధ్య కాలంలో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంపౌండ్ నుంచి వచ్చిన దర్శకులు తెర మీద రికార్డ్స్ స్పృష్టిస్తున్నారు. ‘ఉప్పెన’తో బుచ్చిబాబు సెన్సేషనల్ హిట్ క్రియేట్ చేస్తే, ‘దసరా’తో శ్రీకాంత్ ఓదెల సరికొత్త ట్రెండ్ సెట్ చేసాడు. విరూపాక్ష సినిమాతో ‘కార్తీక్ దండు’ మరో శిష్యుడు ఈ సినిమాతో దర్శకుడి గా పరిచయమయ్యారు. ఇప్పటికే, విడుదలైన సాంగ్స్, టీజర్ మరియు ట్రైలర్ ప్రేక్షకుల నుండి అనుహ్య స్పందన లభిస్తుంది. బాపినీడు.బి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర ఎల్ఎల్‌పీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ రోజు అన్ని ల్యాంగ్వేజ్ లో విడుదలైన ‘విరూపాక్ష’ చిత్రం ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం.
కథ: ‘1979’ సంవత్సరంలో ‘ఇద్దరు దంపతులు’ భయానకం కలిగించే విధంగా పూజలు నిర్వహిస్తుండగా, ‘రుద్రవనం’లో ఉండే ఊరి గ్రామ ప్రజలందరు కలిసి ఆ ఇద్దరినీ చెట్టు దగ్గర దహనం చేస్తారు. కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత, పార్వతి(యాంకర్ శ్యామల)కి చుట్టాలైన సూర్య(సాయి ధరమ్ తేజ్) రుద్రవనం గ్రామానికి అతిధి గా వస్తాడు. సర్పంచ్(రాజీవ్ కనకాల) కూతురు నందిని(సంయుక్త మీనన్) చూసిన ‘సూర్య’ ఒకరిని ఒకరు ఇష్టపడతారు. అప్పటికే, వారం రోజులు నుంచి కనిపించకుండ పోయిన ‘సిద్ధుడు’ తిరిగి అమ్మవారి జాతర రోజున వచ్చి గర్భగుడిలో చనిపోతాడు. ఆ రోజు నుంచి, ‘రుద్రవనం’ గ్రామంలో వరుస మరణాలు ఎంతో భయానకంగా సంభవిస్తాయి. మృతుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. ఈ మిస్టరీని ‘సాయి ధరమ్ తేజ్’ ఎలా చేదిస్తాడు. మిస్టరీ డెత్స్ వెనకాల ఎవ్వరైనా ఉన్నారా? ఆ ఇద్దరు దంపతులకి ప్రస్తుతంలో జరిగే సంఘటనలకి ఏమైనా సంబంధం ఉందా? ఇవన్నీ తెలియాలి అంటే, మీరు సినిమా తప్పకుండ థియేటర్ లో చుడాలిసిందే?
కథనం, విశ్లేషణ: రూపంలేని కన్ను అంటే శివుడి మూడో కన్ను. ఈ సినిమాలో రూపం లేని శక్తితో పోరాటం కాబట్టి మూవీకి ‘విరూపాక్ష’ అని టైటిల్ పెట్టారు. ఇప్పటికే, ఈ టైటిల్ ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది. ఇకపోతే, మన చిన్నతనంలో తెలుగు తెర మీద బాగా భయపెట్టిన సినిమాలు దెయ్యం, రాత్రి, అరుంధతి. రీసెంట్ గా వచ్చిన ‘మసుద’. కాకపోతే, రాను రాను కథ లో సరైన కధనం, గ్రిప్పింగ్ పాయింట్ ప్రెజెంట్ చెయ్యలేకపోతే థియేటర్ లో ప్రేక్షకులు కుర్చోపెట్టడం కష్టమే. మరి, కార్తిక్ దండు ప్రేక్షకులని థియేటర్ లో కుర్చోపెట్టాడా లేదో తెలుసుకుందాం?
సినిమా ప్రారంభంలోనే కొన్ని సంఘటనలు ప్రేక్షకులని అతి భయానకానికి గురి చేస్తాయి. కొద్దీ పాటి సీన్స్ తరువాత ‘రుద్రవనం’ గ్రామానికి హీరో సూర్య(సాయి ధరమ్ తేజ్) వస్తాడు. సూర్యకి & నందినికి మధ్య జరిగే లవ్ ట్రాక్ తెర మీద చూడముచ్చటగా ఉంటుంది. ముఖ్యంగా, ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చే ‘నచ్చావులే నచ్చావులే’ సాంగ్ వినసొంపు గా ఉండటంతో పాటు, కొన్ని డైలాగ్స్ బాగా ఆకట్టుకుంటాయి. డైరెక్టర్ సుకుమార్ ఆడియో ఫంక్షన్ లో చెప్పినట్టు గా హీరో ‘సాయి ధరమ్ తేజ్’ కి ఈ సినిమా ఒక పునర్జన్మ లాంటిది. ఎందుకంటే, సినిమా కథ కూడ అలాంటిదే. దర్శకుడు సినిమాలో క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానానికి హ్యాట్స్ ఆఫ్. అలాగే ట్రైన్ షాట్, కాకి తో జరిగే కొన్ని సీన్స్, క్లైమాక్స్ సీన్స్ ప్రేక్షకులని బెంబేలితిస్తాయి. సినిమాలో మ్యూజిక్, ఆర్ట్, సినిమాటోగ్రఫీ సినిమా స్థాయిని పెంచింది. దర్శకుడు పూర్తిగా అన్ని కోణంలో సినిమాని సక్సెస్ ఫుల్ గా డెలివర్ చేసాడనే చెప్పాలి. సో, తప్పకుండ అందరు ఫ్యామిలీ తో చూడాలిసిన సినిమా.
నటి నటులు పెర్ఫామెన్స్: హీరో సాయి ధరమ్ తేజ్ ప్రతి సీన్స్ లో ఎంతో చక్కగా కథని మోస్తూ, నటనని మెప్పించడంలో పోటా పోటీ పడిన విధానం అద్భుతం. సంయుక్త మీనన్ ని మునుపెన్నడూ చూడని విధంగా ఈ సినిమాలో సరికొత్తగా చూస్తారు. ఈ ముద్దు గుమ్మా యాక్టింగ్ తెర మీద చుసిన తరువాత ఇంత టాలెంట్ ఉందా? అనుకునే ప్రతి ఒక్కరు థియేటర్ లో ఖుర్చీని బిగపట్టుకొని సినిమా చుడాలిసిందే. సోనియా సింగ్, బిగ్ బాస్ ఫెమ్ రవి కథ కి ఎంతో కీలకం, ఇద్దరు తమ పాత్రలకి న్యాయం చేసారు. అజయ్, బ్రమ్మాజి, రాజీవ్ కనకాల, సునీల్, సాయి చంద్, యాంకర్ శ్యామల తమ పరిధి మేరకు ప్రతి ఒక్కరు బాగా రాణించారు.
సాంకేతిక విభాగం: డైరెక్టర్ ‘కార్తిక్ దండు’ కథ, కాస్టింగ్ ఎంచుకున్న తీరు, స్క్రీన్ ప్లే ఎంతో గ్రిప్పింగ్ గా మలిచిన విధానం సూపర్బ్. క్లైమాక్స్ సన్నివేశాలు నెస్ట్ లెవల్ ఉన్నప్పటికీ, ఇంకొంచెం బెటర్ గా తీర్చిదిద్దవచ్చు. అక్కడక్కడ తెర మీద సుకుమార్ మేకింగ్ ఛాయలు కనిపించడం సినిమాకి అసెట్. నవీన్ నూలి ‘ఎడిటింగ్’ వర్క్ శ్రద్ద తీసుకుంటూనే ఎంతో క్రిస్పీ గా సమకూర్చారు. ‘అజనీష్ లోకానాధ్’ అందించిన మ్యూజిక్ ఖచ్చితంగా ప్రేక్షకులు బ్రమ్మరథం పడతారు. అంతే కాదు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సూపర్బ్. శ్యామ్ దత్ అందించిన సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి హైలైట్. సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ ఏ మాత్రం తీసిపోకుండా రిచ్ గా ఉన్నాయి.
రేటింగ్: 4/5
బాటమ్ లైన్: వండర్స్ క్రియేట్ చేయనున్న ‘విరూపాక్ష’
రివ్యూ బై: తిరుమలశెట్టి వెంకటేష్