విజయ్, శీతల్ భట్ జంటగా నటించిన “విల్లా 369” చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని, సెన్సార్ కార్యక్రమాలకు సిద్ధమైంది. విగన్ క్రియేషన్స్ సమర్పణలో, విద్య గణేష్ నిర్మించిన ఈ చిత్రానికి సురేశ్ ప్రభు దర్శకత్వం వహించారు. లైన్ ప్రొడ్యూసర్ శీలం ప్రణయ్ కే రెడ్డి, ఎగ్జిక్యుటివ్ ప్రొడ్యూసర్లు చిత్రం శ్రీను, ఏం లక్ష్మణ్ బాబు. ఈ చిత్రం ఒక విల్లాలో జరిగిన థ్రిల్లింగ్ సంఘటన ఆధారంగా రూపొందించబడింది.

చిత్ర యూనిట్ త్వరలోనే టీజర్, ట్రైలర్ తో పాటు, రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు. “విల్లా 369” చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని, సెన్సార్ కి వెళ్ళడంతో, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ నమ్మకం వ్యక్తం చేస్తుంది.

Leave a comment

error: Content is protected !!