కొత్త కాన్సెప్ట్‌తో కొత్తవాళ్లు మంచి చిత్రం ఇవ్వాలన్న కసితో ఇండస్ట్రీలోకి రావడం శుభపరిణామం. అలాంటి టీమే ‘విల్లా 369’ . విజయ్‌, శీతల్‌ బట్ జంటగా… సురేష్‌ ప్రభు డైరెక్షన్‌లో విద్యగణేష్‌ నిర్మాణ సారధ్యంలో విగన్‌ క్రియేషన్స్‌ ప్రజెంట్ చేస్తున్న మూవీ ఈ ‘విల్లా 369’. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ ను డైరెక్టర్‌ తేజ రిలీజ్‌ చేసారు.
మంచి సబ్జెక్ట్‌తో చక్కని నటీనటులను సెలక్ట్‌ చేసుకుని అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం దర్శక నిర్మాతలకు మంచి విజయాన్నందించాలని ఆకాంక్షించారు దర్శకుడు తేజ.


నటీనటుల సెలక్షన్‌లోనే దర్శకుడు సగం విజయం సాధించాడని, టెక్నిషియన్స్‌ అద్భుతమైన పనితనం ఈ చిత్రానికి హైలెట్ కానుందని చిత్ర నిర్మాత తమ టీమ్‌ను అభినందించారు. ఈ సినిమాకు డి. ఓ. పి ర్యాడీ రఫీ కెమెరా పనితనం అద్భుతంగా ఉంది. సంగీత దర్శకుడు మహావీర్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు.
కథ కథనాలు అద్భుతంగా చేసినా.. మంచి టీమ్‌ , ఆ టీమ్‌తో వర్క్‌ చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపాడు దర్శకుడు సురేష్‌ ప్రభు. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని అన్నారు.

క్యాస్టింగ్ : రవి వర్మ, జ్యోతి, చిత్రం శ్రీను, శివారెడ్డి తదితరులు
టెక్నిషియన్స్‌ :-
నిర్మాత : విద్య గణేష్
దర్శకుడు : సురేష్ ప్రభు
సహ నిర్మాత : డా.రాకేష్
కెమెరా : ర్యాడీ రఫీ
సంగీతం : మహావీర్
ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్స్ : చిత్రం శ్రీను, లక్ష్మణ్ బాబు
పి. ఆర్ ఓ : మధు వి.ఆర్

Leave a comment

error: Content is protected !!