మూవీ రివ్యూ: విక్రాంత్ రోణ (Vikrant Rona)
నటి నటులు: సుదీప్, నిరూప్ భండారి, నీతా అశోక్, జాక్వలిన్ ఫెర్నాండేజ్, రవిశంకర్ గౌడ, మధు సుధన్ రావు తదితరులు
ఎడిటర్: అసుక్ కుసుగొల్లి
సినిమాటోగ్రఫీ: విలియమ్ డేవిడ్
సంగీతం: అజ్నీష్ లోక్‌నాథ్
సహ నిర్మాత: అలంకార్ పాండియన్
నిర్మాత: శాలిని జాక్ మంజు
దర్శకుడు: అనూప్ బంఢారీ
విడుదల తేదీ: జూలై 28, 2022

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన హీరో కన్నడ స్టార్ కిచ్చా సుదీప్. ‘ఈగ’, బాహుబలి’, ‘సైరా’ చిత్రాల్లో నటించి మెప్పించారు. కేజియఫ్ ఎఫెక్ట్ తర్వాత కన్నడ సినిమాలపై అందరి దృష్టి పడింది. ఈ క్రమంలో సుదీప్ హీరోగా వచ్చిన సినిమా “విక్రాంత్ రోణ”. లేటెస్ట్ గా వచ్చిన ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ పబ్లిక్ లో బాగా బజ్ క్రియేట్ చేశాయి. ఈ అన్ని భాష‌ల్లో త్రీడీ, టూడీ లో విడుదల చేశారు.ఈ సినిమాకి అనుప్ భండారి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా..? రివ్యూలో చూద్దాం..

కథ: కొమరట్టు అనే ప్రాంతం లో పోలీస్ ఇన్స్‌పెక్టర్‌ ని పాడుబడ్డ బావిలో వేలాడదీస్తారు. అంతే కాదు, ఆ ఊళ్లో కొంత మంది పిల్లల్ని హత్య చేయబడుతున్నారని తెలుస్తుంది. ఆ ఊరికి కొత్త ఇన్స్‌పెక్టర్‌గా చార్జ్ తీసుకున్న విక్రాంత్ రోణ (సుదీప్) ఇన్వెస్టిగేషన్ షురూ చేస్తాడు. కొన్ని రోజులు క్రితం అదే పాడుబడ్డ బావి ఇంటిలోకి దిగిన పన్నా (నీతా అశోక్) ఫ్యామిలీ కథ ఏంటి? ఊరిలో చిన్నారుల మరణానికి, విక్రాంత్ రోణ వ్యక్తిగత జీవితానికి ఏమైనా సంబంధం ఉందా? పిల్లలను చంపుతున్న వ్యక్తిని “విక్రాంత్ రోణ” ఎలా పట్టుకున్నాడు? అసలు ఈ కేసును విక్రాంత్ రోణ ఎలా చేధించాడు అనేది కథ..

కథనం, విశ్లేషణ: తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన “కిచ్చా సుదీప్” తన కెరీర్ లో ‘విక్రాంత్ రోణ’ ఒక విజువల్ వండర్ అని చెప్పచ్చు. విజువల్ వండర్ & ఆర్ట్  పరంగా బాగా ఆకట్టుకున్నారు కానీ, కధలో బలం లేకపోవడం వల్ల ప్రేక్షకులని నిరుత్సాహ పరిచిందనే చెప్పాలి.

కోమరట్టు గ్రామంలో పిల్లలు చనిపోతున్న క్రమంలో అక్కడకి పోలీస్ గా వచ్చిన సుదీప్ పాత్ర, ఇంట్రడక్షన్ ఫైట్ సన్నివేశాలు బాగున్నాయి. లుక్స్ అండ్ నటన పరంగా సూపర్బ్ అనిపించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే పాప తో కూడిన ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకుంటాయి. ఈ సినిమకి గ్రాండ్ విజువల్స్ అలాగే జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రెజెన్స్ ఈ సినిమాకి బాగా ప్లస్. అజ్నీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ డైరెక్షన్ లో మంగ్లీ పాడిన రా రా రక్కమ్మా పాట మరో లెవెల్ కి తీసుకెళ్తాయి. కిచ్చా సుదీప్ ఇచ్చిన ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోతుంది. అక్కడక్కడ కాస్త హారర్, మరికొంత అడ్వెంచర్ అంశాలు పెట్టడంతో వెండితెరపై కొత్త ప్రపంచాన్ని చూసినట్టు ఫీలింగ్ కలుగుతుంది.

సినిమాలో అక్కడక్కడ కన్ఫ్యూజన్‌కు గురవ్వడం, ఈ క్రమంలో స్క్రీన్ ప్లేలో చాలాచోట్ల తడబడటం జరుగుతుంది. చిన్న కథని భారీగా ఖర్చు పెట్టి చేసారు కానీ, కథను చెప్పే విషయంలో ఇచ్చిన డిటైలింగ్‌ను దర్శకుడు అనూప్ బండారీ ని మెచ్చుకోవాలి. 28 ఏళ్ళ కిందట చనిపోయిన ఫ్యామిలీ కథ ని చివరి దాకా సస్పెన్స్ క్యారీ చేసి ఉంటె అద్భుతంగా ఉండేది.

నటి నటులు పెర్ఫామెన్స్: విక్రాంత్ రోణ పాత్రలో కిచ్చా సుదీప్ నటన అదరగొట్టారు. పైగా సొంత డబ్బింగ్ చెప్పుకోవడంతో సమ్ థింగ్ స్పెషల్ అనిపిస్తుంది. నీతా అశోక్ గ్లామరస్‌గా కనువిందు చేస్తుంది. మరో కీలకమైన పాత్రలో నిరూప్ బండారి కూడా బాగా నటించారు. సీనియర్ నటుడు మధుసూధన్ రావు ఊరిపెద్దగా మెప్పించారు. జాక్వలిన్ ఫెర్నాండేజ్ ఉన్నత సేపు స్క్రీన్ మీద మ్యాజిక్ చేస్తుంది. తది తరులు నటి నటులు బాగానే రాణించారు.

సాంకేతిక వర్గం: దర్శకుడు అనూప్ బండారీ వీఎఫ్ఎక్స్‌ టాప్ స్టాండర్డ్స్‌లో తీసాడే కానీ, కథ మీద పట్టు సాధించి ఉంటె బాగుండేది. అజ్నీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ సూపర్బ్. కొన్ని సన్నివేశాల్లో భయపెట్టి ఉత్కంఠ కలిగించారు. సినిమాటోగ్రఫీ చాలా బావుంది. ఎడిటర్ పని తీరు పర్వాలేదు. ముఖ్యంగా ఆర్ట్ డైరెక్టర్ ని మెచ్చుకోవాలి. ఖర్చు విషయంలో నిర్మాత ఎక్కడ రాజీ పడలేదని ప్రతి ఫ్రేమ్‌ ద్వారా మనకి అర్ధమవ్వుతుంది.

బాటమ్ లైన్: విజువల్  వండర్ “విక్రాంత్ రోణ”

రేటింగ్:  3/5 

Review  – Tirumalasetty  Venkatesh

గమనిక : ఈ రివ్యూ క్రిటిక్ అభిప్రాయం మాత్రమే

Leave a comment

error: Content is protected !!