Thangalaan trailer : చియాన్ విక్రమ్ హీరోగా.. పా.రంజిత్‌ దర్శకత్వంలో, కేఈ జ్ఞానవేల్‌ రాజా నిర్మించిన చిత్రం “తంగలాన్”. ఈ చిత్ర ట్రైలర్‌ బుధవారం విడుదలైంది. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో ఇంకా… మాళవిక మోహనన్, పార్వతీ తిరువోతు, పశుపతి తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించారు. కర్ణాటకలోని కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ నేపథ్యంలో బ్రిటిష్‌ పాలనలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది. ట్రైలర్‌లో చూపించిన దృశ్యాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. అప్పటి వాతావరణాన్ని పునరుద్ధరించడంలో దర్శకుడు పా.రంజిత్‌ విజయం సాధించాడు.

బ్రిటిష్‌ అధికారులు స్థానిక గిరిజనులను బంగారం తవ్వడానికి బలవంతం చేయడం. ఒక గిరిజన తెగ నాయకుడిగా విక్రమ్‌ పాత్ర. రెండు తెగల మధ్య యుద్ధం. విల్లు, బరిసెలు, ఈటెలతో యాక్షన్‌ సీక్వెన్స్‌లు. ఆఖర్లో బ్లాక్‌ పాంథర్‌తో విక్రమ్‌ పోరాటం “చావుని ఎదురించే వాళ్లకు మాత్రమే ఇక్కడ జీవితం” అనే డైలాగ్‌ ట్రైలర్‌కు హైలైట్‌గా నిలిచింది. ఈ చిత్రం ఆగస్టులో థియేటర్లలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. “తంగలాన్” ట్రైలర్‌ చూసిన తర్వాత ప్రేక్షకుల అభిప్రాయాలు చాలా సానుకూలంగా ఉన్నాయి. విక్రమ్‌ నటన, యాక్షన్‌ సీక్వెన్స్‌లు, దర్శకత్వం ప్రశంసలు అందుకుంటున్నాయి. శివపుత్రుడు, అపరిచితుడు చిత్రాల తర్వాత మళ్లీ అంతటి స్థాయిలో తంగలాన్ లో విక్రమ్ తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. మరి బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!