మూవీ: “విక్రమ్”
నటి నటులు: కమల్ హాసన్, ఫహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి, సూర్య, కాళిదాస్ జయరామ్, గాయత్రి, స్వతిష్ఠ, నరేన్, అర్జున్ దాస్, శివాని నారాయణన్ తదితరులు
సంగీతం:అనిరుధ్ రవిచందర్
ఛాయాగ్రహణం: గిరీష్ గంగాధరన్
నిర్మాత: కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్
రచన, దర్శకత్వం: లోకేష్ కనగ్ రాజ్

విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌, లోకేశ్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ విక్రమ్. ఈ మూవీలో విజయ్‌ సేతుపతి, ఫాహద్‌ ఫాజిల్‌ నటించిన విషయం తెలిసిందే. పైగా ఈ మూవీ లో సూర్య అతిథి పాత్రలో చేయనున్నాడు. 1986లో వచ్చిన ‘ఏజెంట్‌ విక్రమ్‌ 007’ మూవీ కథకు లింక్‌ చేసి రూపొందించారు. ఇంత మంది స్టార్ డమ్ ఉన్నహీరో లు ఒకే సినిమాలో యాక్ట్ చేయడం, హాలివూడ్ లో ఎక్కువుగా చూస్తుంటాం. ఇప్పుడు ఈ సినిమా ద్వారా ఇండియన్ ఫ్యాన్స్ కి కన్నుల పండుగే అని చెప్పాలి. ఇప్పటికే టీజర్, ట్రైలర్ లతో ఈ సినిమాపైన భారీ అంచనాలు పెరిగాయి. ఈ రోజు విక్రమ్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా మెప్పించిందో..!! లేదో..!! తెలుసుకుందాం !

కథ:
అరుణ్ కుమార్ విక్రమ్ అలియాస్ కర్ణన్ (కమల్ హసన్) రిటైర్డ్ రా బ్ల్యాక్ స్క్వాడ్ ఏజెంట్ గా సినిమాలో కనిపిస్తారు. నగరంలో గుర్తు తెలియని వ్యక్తులు మాస్క్ రూపంలో వచ్చి కమల్ హసన్ ని చంపడంతో, అమర్ (ఫహద్ ఫాసిల్) ఒక అండర్ కవర్ పోలీసు అధికారి గా వస్తాడు. అదే విధంగా భారీగా డ్రగ్స్ నింపిన కంటైనర్, సంతానం (విజయ్ సేతుపతి) కి చేరకుండ మిస్ అవ్వుతుంది. ఆ కంటైనర్ కోసం సంతానం పరి తపిస్తుంటాడు. మాస్క్ వేసుకున్న గ్యాంగ్ ని పట్టుకోవడానికి అమర్ (ఫహద్ ఫాసిల్) తన టీం తో కలిసి తీవ్రంగా గాలిస్తుంటారు. ఆ ప్రక్రియలో, గ్యాంగ్‌స్టర్ సంతానం (విజయ్ సేతుపతి) కి మాస్క్ గ్యాంగ్ కి ఎదో లింక్ ఉందని తెలుస్తుంది. అంతే కాకుండా ఎదో ర‌హ‌స్య మిష‌న్ జరుగుతుందంని గమనిస్తాడు. అసలు ఆ మిషన్ ఏంటి? ఆ మిషన్ లో ఎంత మంది భాగస్వాములు అయ్యారు. అసలు ముసుగు వేసుకుని చంపే వ్యక్తి ఎవరు? కర్ణన్ బ్యాక్‌స్టోరీ ఏంటి? ఇవ్వన్నీ తెలియాలి అంటే మీరు ఖచ్చితంగా సినిమా చుడాలిసిందే?

కధనం,విశ్లేషణ:
లోకనాయకుడు కమల్ హాసన్ ఇంట్రడక్టన్ అదిరిపోతుంది. అయ్యన పాత్ర ఎంతో ముఖ్యమైంది గా సినిమా బిగినింగ్ లోనే చూపిస్తారు. విక్రమ్ మూవీ స్టైలిష్ యాక్షన్ తరహాలో స్టార్ట్ అవ్వుతుంది. మూవీ బిగినింగ్ లో నెమ్మదిగా సాగిన అక్కడక్కడా వచ్చే థ్రిల్ ఎలిమెంట్స్ బాగుంటాయి. విజయ్ సేతుపతి ఇంట్రడక్షన్ అయితే మైండ్ బ్లోయింగ్. ఈ సినిమాలో ఎంతో అద్భుతంగా విజయ్ సేతుపతి పాత్ర ఉంటుంది. ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ సీన్స్ కి అయితే థియేటర్ లో పూనకాలే.

లోకేష్ పూర్తి కథని ఫస్ట్ హాఫ్ లో రివీల్ చేయలేదు. సినిమా గురించి కొన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పటికి ఓవరాల్ గా బాగుంది. సెకండ్ హాఫ్ ప్రారంభంలో సినిమా స్లో గా అనిపిస్తుంది. ఆ తర్వాత ట్విస్టులు రివీల్ కావడంతో సినిమా పుంజుకుంటుంది. యాక్షన్, థ్రిల్స్, ట్విస్ట్ లతో మాయ చేసారు లోకేష్. ఓవరాల్ గా విక్రమ్ థియేటర్ లో విశ్వ‌రూపం ప్రదర్శించాడు

విక్రమ్ ప్లాష్ బ్యాక్ ని ఇంకా బాగా డిజైన్ చేసుకుంటే బాగుండేది. కథను మలుపు తిప్పే సూర్య ప్రదాన పాత్ర ని ఇంకా బలంగా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే బాగుండేది. అప్పుడే సూర్య పాత్రకి జస్టిఫికేషన్ వచ్చి ఉండేది కాబోలు.

నటి నటుల పెర్ఫామెన్స్: విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌ నటన ఏ మాత్రం తీసిపోకుండ ప్రేక్షకులకి కనుల పండగ గా ఉంటుంది. ఫహద్ ఫాజిల్ తన డైన సైలిలో సటిల్డ్ గా పెర్ఫామ్ చేస్తాడు. విజయ్ సేతుపతి కెరీర్ లో బెస్ట్ పెర్ఫామెన్స్ అని చెప్పచ్చు. ఇకపోతే సూర్య అద్భుతమైన నటన మరియు గెటప్ తో అలరిస్తాడు. తదితర నటి నటులు, కాళిదాస్ జయరామ్, గాయత్రి, స్వతిష్ఠ నటనలో బాగా రాణించారు.

సాంకేతిక వర్గం:
దర్శకుడు లోకేష్ కనకరాజ్ రచయితగా పర్వాలేదు అనిపించినా, దర్శకుడిగా మాత్రం పూర్తి న్యాయం చేశారు. ముఖ్యమైన పాత్రలతో చిత్రాన్ని నడిపినప్పటికీ.. కథనం మీద ఇంకా శ్రద్ధ పెట్టి ఉండాల్సింది. మ్యూజిక్ డైరెక్ట్రర్ అనిరుద్ బిజియంతో చెలరేగిపోయాడు. సినిమాటోగ్రఫీ ప్రతి షాట్ లో కట్టిపడేసే విధంగా ఉంది. ఎడిటింగ్ బాగున్నప్పటికీ, సెకెండాఫ్ లో కొన్ని సాగతీత సీన్స్ ట్రీమ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. సినిమాలో నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.

రేటింగ్: 3.5/5

బాటమ్ లైన్:  పూనకాలు తెప్పించిన “విక్రమ్” 

Review – Tirumalasetty Venkatesh 

Leave a comment

error: Content is protected !!