చిత్రం: కోబ్రా
నటి నటులు: విక్రమ్, శ్రీనిధి శెట్టి, ఇర్ఫాన్ పఠాన్, మీనాక్షి గోవిందరాజన్, మిర్నాళిని రవి, K. S. రవికుమార్, రోషన్ మాథ్యూ, సర్జానో ఖలీద్, ఆనందరాజ్, రోబో శంకర్ తదితరులు…
సంగీతం: A. R. రెహమాన్
ఛాయాగ్రహణం: భువన్ శ్రీనివాసన్ ,హరీష్ కన్నన్
ఎడిటర్: భువన్ శ్రీనివాసన్, జాన్ అబ్రహం
నిర్మాత: S. S. లలిత్ కుమార్
రచన, దర్శకత్వం: ఆర్. అజయ్ జ్ఞానముత్తు
విడుదల తేదీ: ఆగస్ట్ 31, 2022

తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ హీరోగా కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా అజ‌య్ జ్ఞాన‌ముత్తు డైరెక్షన్‌లో తెరకెక్కిన మూవీ కోబ్రా. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందిన ఈ మూవీని సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించారు. ఈ సినిమాకి ఎ.ఆర్‌.రెహ‌మాన్ మ్యూజిక్ అందించడం విశేషం. ఎన్నో అంచనాల మధ్య ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వరుస ఫ్లాప్స్ తో సతమతమవ్వుతున్న విక్రమ్‌కు ఈ మూవీ విజయాన్ని అందిస్తుందా..? మరి ఈ సినిమా కథ ఏంటో ఓ లుక్కేద్దాం..

కథ: మధి(విక్రమ్) పిల్లలకి గణితశాస్త్రం చెప్పే ఒక ఉపాధ్యాయుడు. మధి ని చూసి ఇష్టపడిన భావనా ​​మీనన్(శ్రీనిధి శెట్టి) పెళ్ళికి ఓప్పుకునే దాకా తనతోనే కలిసి ఉంటుంది. ఒక పక్క ఇంటర్నేషనల్ వైడ్ గా పలుకుబడి ఉన్న వ్యక్తులు చంపబడతారు. పోలీసు శాఖకు ఒక్క ఆధారం కూడా దొరకదు. కానీ, జుడిత్ శాంసన్‌(మీనాక్షి గోవిందరాజన్) మ్యాథమేటీషియన్‌ స్టూడెంట్ తెలివితేటలు వల్ల పోలీస్ లకి క్లూ దొరుకుతుంది. ఇండియా లో ఘోరాలు చేస్తూ చలామణి గా తిరుగుతున్న రిషి (రోషన్ మాథ్యూ) కి మధి(విక్రమ్) కి సంబంధం ఉందా? ఇందులో మిర్నాళిని రవి నటించిన ముఖ్య పాత్ర ఏంటి? అనేది కథ? పోలీస్ ఆఫీసర్ అస్లాన్ యిల్మాజ్(ఇర్ఫాన్ పఠాన్) ఈ కేసును ఎలా డీల్ చేశాడు, ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా పూర్తిగా చూడాల్సిందే.

కధనం,విశ్లేషణ:
కోబ్రా రెగ్యులర్ స్టోరీ లా ఉన్నా, నాన్ లీనియర్ స్క్రీన్‌ప్లే ఉండటంతో, కథలో తర్వాత ఏం జరగబోతుందో అనే ఆసక్తి మొదలవుతుంది. సినిమా మొదటి భాగంలో కొన్ని సన్నివేశాలు మనల్ని ఎంగేజ్ చేస్తాయి అలాగే, ఇంటర్వెల్ బ్యాంగ్ దుమ్మురేపుతోంది. కానీ సెకండ్ ఆఫ్ ట్రాక్‌ను కోల్పోయి మరింత ఊహించదగినదిగా మారుతుంది. సినిమా క్లైమాక్స్ లో సీన్లు మెప్పిస్తాయి. సినిమాలో విక్రమ్ హాలూసినేషన్ పాయింట్ మరియు డిఫరెంట్ లుక్స్ సగటు ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది. ఈ సినిమాలో సుడుకో పజిల్ సన్నివేశాలు చాలా బాగా ఆకట్టుకుంటాయి. అక్కడక్కడ ప్రేక్షకులు కన్ఫ్యూజన్ కి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉన్న ల్యాగ్ లేకపోవడంతో పెద్దగా పట్టించుకోరు.

చియాన్ విక్రమ్ మల్టిపుల్ గెటప్‌ల మేకప్ కొన్ని ఫ్రేమ్‌లలో అంతగా ఆకట్టుకోకపోయిన, విక్రమ్ నటనతో మనం ఈ చిన్న లోపాలను పూర్తిగా మర్చిపోతాము. శ్రీనిధి శెట్టి తో సాగే సీన్స్ చాలా సటిల్డ్ గా ఉంటాయి. క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఇంటర్ పోల్ ఆఫీసర్ గా విలన్ ని ఛేజ్ చేసే సీన్స్ థ్రిల్లింగ్ గా ఉంటాయి. రోషన్ మాథ్యూ నెగిటివ్ రోల్‌లో అతను చేసిన పెర్ఫామెన్స్ సినిమా కి బాగా ప్లస్ అయ్యిందనే చెప్పాలి. కానీ, అతన్ని ఇంకా బాగా వినియోగించుకుంటే బాగుండేది.

ఫారిన్ లొకేషన్లలో చిత్రీకరించిన సన్నివేశాలు తెరపై అద్భుతంగా కనిపిస్తాయి. అక్కడక్కడా VFX మీద కొంచెం శ్రద్ధ వహించాల్సింది. దిలీప్ సుబ్బరాయన్ కంపోజ్ చేసిన ఫైట్స్ మాస్ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తాయి. డిమాంట్ కాలనీ మరియు అంజలి సీబీఐ సినిమాలను అందించిన అజయ్ జ్ఞానముత్తు కోబ్రా విషయంలో స్టోరీ లైన్‌లో కొత్తదనం ఏమీ లేకున్నా, స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను ఎలాగోలా కట్టిపడేసాడు.చియాన్ విక్రమ్ యొక్క గత సినిమాలతో పోలిస్తే కోబ్రా ఓవరాల్‌గా చాలా బాగుందని అనిపిస్తుంది.

నటి నటుల పెర్ఫామెన్స్: హీరో విక్రమ్ గురించి ఎంత చెప్పిన తక్కువే ఫైట్స్, డెడికేషన్ వేరే లేవేల్ అసలు. హిట్ అనే మాట ఒక్కటే తక్కువ కానీ పెర్ఫామెన్స్ సూపర్బ్. కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి స్క్రీన్ మీద ముద్దొచ్చేస్తుంటుంది అంత బాగా యాక్ట్ చేసింది. మిర్నాళిని రవి ముఖ్య పాత్ర పోషించి సినిమా మొత్తం తన వైపు తిప్పుకుంది. మీనాక్షి గోవిందరాజన్ సస్పెన్స్ క్రియేట్ చేస్తూ బాగా రాణించింది. ఇర్ఫాన్ పఠాన్ పోలీస్ ఆఫీసర్ రోల్ లో న్యాయం చేసారు. K. S. రవికుమార్, రోషన్ మాథ్యూ, సర్జానో ఖలీద్, ఆనందరాజ్, రోబో శంకర్ తదితరులు తమ పాత్రలో ఓదిగిపోయారు.

సాంకేతిక వర్గం: ప్రేక్షకులు విక్రమ్ ని ఎలా చూడాలి అనుకున్నారో అలా చూపించడానికి తన వంతు కృషి చేసిన డైరెక్టర్ ఆర్. అజయ్ జ్ఞానముత్తు హ్యాట్సాఫ్. కానీ, కథ విషయంలో ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకొనిఉంటే బాగుండేది. ముఖ్యంగా, కొన్ని సన్నివేశాలలో కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యిన బాగానే హ్యాండిల్ చేసాడు. ఇకపోతే, ఈ సినిమాకి A. R. రెహమాన్ కొట్టిన బ్యాగ్రౌండ్ బాగా ప్లస్ అయ్యాయి. భువన్ శ్రీనివాసన్, జాన్ అబ్రహం ఇద్దరు ఎడిటింగ్ కి ఇంకాస్త పదును పెట్టాలిసింది. భువన్ శ్రీనివాసన్ ,హరీష్ కన్నన్ ఇద్దరు ఒక్క మాటలో చెప్పాలి అంటే ఛాయాగ్రహణం అదరకొట్టారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉంటాయి.

రేటింగ్: 3/5

బాటమ్ లైన్: గట్టెక్కిన “కోబ్రా”

Review By: Tirumalasetty Venkatesh

Leave a comment

error: Content is protected !!