Vijaysethupathi : తమిళ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించిన మహారాజా చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. జూన్ 14న విడుదలైన ఈ చిత్రం, రిలీజైనప్పటి నుంచే పాజిటివ్ టాక్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, వసూళ్లలో దూసుకుపోతోంది. తాజాగా ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 50 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టి, సెన్సేషన్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. విజయ్ సేతుపతి నుండి సాలిడ్ కమ్ బ్యాక్ కోసం ఎదురుచూసిన అభిమానులకు ఈ చిత్రం ఓ మంచి ట్రీట్ లాంటిది. చిత్రంలో విజయ్ నటన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.

కురంగు బొమ్మై ఫేమ్ నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం ఈ చిత్రానికి ప్రాణం పోసింది. మహారాజా చిత్రం లాంగ్ రన్ లో మరింత వసూళ్లను రాబట్టే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. మహారాజా చిత్ర విజయానికి చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది.

Leave a comment

error: Content is protected !!