Vidudalai 2 : మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి రీసెంట్ గా “మహారాజ” సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం విజయ్ కెరీర్ లో మైలురాయిగా నిలిచింది. తదుపరిగా వెట్రిమారన్ దర్శకత్వంలో “విడుదల 2” సినిమాలో నటిస్తున్నాడు. దీనికి సంబంధించిన పోస్టర్ మేకర్స్ విడుదల చేశారు. ఒళ్ళంతా రక్తంతో, కత్తి పట్టుకుని సీరియస్ లుక్ లో ఉన్న విజయ్ సేతుపతి అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ ఫోటో ఒక ఫైట్ సీక్వెన్స్ లో భాగమని తెలుస్తోంది. దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది.

వెట్రిమారన్ కల్ట్ కథలకు, వాస్తవికతకు పెట్టింది పేరు. తమిళనాట వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ దర్శకుడు, ఎప్పుడూ స్టార్స్ కంటే కథలకు ప్రాధాన్యతనిస్తాడు. “విడుదల 1” లో సూరి కానిస్టేబుల్ పాత్రలో నటించి మెప్పించగా, ఆ సినిమాలో విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషించారు.

ఇప్పుడు “విడుదల 2” లో విజయ్ సేతుపతి లీడ్ రోల్ లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ చాలా బలంగా ఉంటాయని ఊహాగానాలు ఉన్నాయి. మంజు వారియర్ విజయ్ సేతుపతికి జోడీగా నటిస్తున్న ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఆర్.ఎస్. ఇన్ ఫాటిమెంట్, ఏ గ్రాస్ రూట్ ఫిల్మ్ కంపెనీలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

Leave a comment

error: Content is protected !!