అందరు హీరోయిన్స్ లాగానే ఆమె కూడా .. గ్లామర్ ఒలికించడంలోనూ, అందాలు ఆరబోయడంలోనూ ముందు వరుసలో ఉండేది. కాకపోతే…. ఆమె యాక్షన్ చిత్రాల్లోనే ఎక్కువ పేరు తెచ్చుకుంది. భారీ ఫైట్స్ ను సైతం అవలీలగా చేసి పడేసేది. ఆమె పేరు విజయలలిత. టాలీవుడ్ లో తొలి యాక్షన్ క్వీన్ గా ఆమెను అభివర్ణించ వచ్చు. గన్ ఫైరింగ్, హార్స్ రైడింగ్.. లాంటి వన్నీ ఆమెకు కొట్టిన పిండి. విజయలలిత 1960, 70లలో అనేక తెలుగు సినిమాలలో నటించింది. ‘సాధు ఔర్ షైతాన్, రాణీ మేరా నామ్, హథ్‌కడీ’ లాంటి కొన్ని హిందీ సినిమాలు, కొన్ని తమిళ చిత్రాలలో నటించింది.
యన్టీఆర్ , అక్కినేని నాగేశ్వరరావు తదితర అగ్రశ్రేణి తెలుగు సినీ నటుల సరసన నటించిన ఈమె లేడీ జేమ్స్ బాండ్ పాత్రలకు ప్రసిద్ధి. ఈమె నటించిన సినిమాలలో ‘రౌడీరాణి, రివాల్వర్ రాణి, చలాకీ రాణి కిలాడీ రాజా, భలే రంగడు, మనుషుల్లో దేవుడు, కదలడు వదలడు, బస్తీ బుల్ బుల్ , సి.ఐ.డి రాజు లాంటి సినిమాలు ప్రసిద్ధమైనవి. ఈమె ఎంతో క్రమశిక్షణ, సమయపాలనతో కచ్చితమైన సమయానికి సినిమా షూటింగులకు హాజరవుతూ ఉండే విజయలలిత దాదాపు 860 సినిమాలలో నటించి సత్తా చాటుకున్నారు. ఇక విజయలలిత .. నిన్నటి తరం లేడీ సూపర్ స్టార్ విజయశాంతికి స్వయానా పిన్ని అవుతుంది. నేడు విజయలలిత పుట్టిన రోజు . ఈ సందర్భంగా ఆ యాక్షన్ క్వీన్ కు శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.