GOAT movie : తమిళ స్టార్ హీర దళపతి విజయ్, వెంకట్ ప్రభు కాంబోలో “ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్” .. గోట్ అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలసిందే. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 5, 2024న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.  లేటెస్ట్ గా మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా ఆసక్తికరమైన అప్‌డేట్‌ను పంచుకున్నాడు.

విజయ్ ఈ చిత్రంలో రెండు పాటలు పాడారని తెలిపారు. విజయ్ పాడిన మొదటి పాట “విజిల్ పోడు” ఇప్పటికే విడుదలై మంచి ప్రశంసలు అందుకుంది. మరొక పాట త్వరలోనే విడుదల కానుంది. ఇది విజయ్ ఒకే సినిమాలో రెండు ట్రాక్‌లకు తన గాత్రాన్ని అందించిన మూడవ సినిమా.

ఇంక ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. జయరాం, స్నేహా, లైలా, యోగి బాబు, విటివి గణేష్, అజ్మల్ అమీర్, మైకో మోహన్, వైభవ్, ప్రేమ్‌జీ, అజయ్ రాజ్, అరవింద్ ఆకాష్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. AGS ఎంటర్ టైన్‌మెంట్ బ్యానర్ పై అర్చ్చన కల్పాతి, కల్పాతి ఎస్. అఘోరం, కల్పాతి ఎస్. గణేష్, కల్పాతి ఎస్. సురేష్‌లు నిర్మిస్తున్న ఈ చిత్రం ఏ రేంజ్ లో బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!