మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ తమ్ముడు వైష్ణవ్ తేజ హీరోగా ఎంట్రీ ఇస్తోన్న ప్రేమకథా చిత్రం ‘ఉప్పెన’. బాలనటుడిగా ‘శంకర్ దాదా యం.బీ.బీ.యస్, అందిరివాడు’ చిత్రాల్లో మేనమామ చిరంజీవితో కలిసి స్ర్కీన్ షేర్ చేసుకున్న వైష్ణవ్ తేజ హీరోగా ఏ స్థాయిలో అలరిస్తాడు అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. నిజానికి రేపు ఈ సినిమా విడుదలవ్వాలి. అయితే కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా సినిమా విడుదల తేదీ వాయిదా పడింది. ఈ పరిస్థితుల్లో కనీసం పోస్ట్ ప్రొడక్షన్ కూడా జరగని ఈ సినిమానుంచి మెగా ఫ్యాన్స్ ను అలరించడానికి ఇందులోని విజయ్ సేతుపతి సెకండ్ లుక్ ను విడుదల చేశారు మేకర్స్.

పంచెకట్టులో చాలా సింపుల్ గా, నేచురల్ గా రివీలైన విజయ్ సేతుపతి లుక్ ఆకట్టుకుంటోంది. ఉప్పెనలో ఆయన విలన్ గా నటిస్తున్నారంటూ.. ఎప్పటినుంచో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ లుక్ కు కూడా మంచి రెస్పాన్స్ దక్కింది. బుచ్చిబాబు సాన  దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ  సినిమాలో కథానాయికగా కృతి శెట్టి నటిస్తోంది. మరి ‘ఉప్పెన’ టాలీవుడ్ బాక్సాఫీస్ ను  ఏ రేంజ్ లో కలెక్షన్స్ తో మంచెత్తుతుందో చూడాలి.

 

Leave a comment

error: Content is protected !!