Vijay Sethupathi : ఇటీవల విడుదలైన విజయ్ సేతుపతి “మహారాజ” చిత్రం తెలుగు, తమిళ భాషల్లో కూడా భారీ విజయం సాధించింది. ఈ సందర్భంగా చిత్రబృందం సోమవారం హైదరాబాద్‌లో ఘనంగా విజయోత్సవాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శకులు మారుతి, గోపీచంద్ మలినేని, బుచ్చిబాబు సానా, అనిల్ కన్నెగంటి హాజరయ్యారు.

“తెలుగు ప్రేక్షకులు ఎక్కడ ఎదురైనా సరే… ’96’ మొదలుకొని ‘ఉప్పెన’ వరకూ నేను నటించిన చిత్రాలన్నింటినీ గుర్తు చేస్తూ మెచ్చుకుంటుంటారు. నాపై చూపిస్తున్న ప్రేమకు ఎంతో కృతజ్ఞుడిని. ‘మహారాజ’కి వస్తున్న అద్భుతమైన స్పందన ఎంతో ఆనందాన్నిచ్చింది.” “నన్ను భావోద్వేగానికి గురిచేసిన స్పందన ఇది. సినిమా గురించి అందరూ ఇంత గొప్పగా మాట్లాడటం ఎంతో తృప్తినిచ్చింది.” అన్నారు హీరో విజయ్ సేతుపతి.

“కథ, స్క్రీన్‌ప్లే, నటన… ఇలా ప్రతి విషయం గురించీ తెలుగు ప్రేక్షకులు మాట్లాడటం ఎంతో సంతోషాన్నిచ్చింది. సినిమాని ఇంతగా ప్రేమిస్తున్న తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు.” అన్నారు ఈ సినిమా దర్శకుడు నితిలన్ స్వామీనాథన్. “మాస్టర్‌ పీస్‌ అనదగ్గ ఓ గొప్ప సినిమా ఇది. చాలా అరుదుగా వస్తుంటాయి ఇలాంటివి. విజయ్ సేతుపతి ఈ తరంలో ఓ గొప్ప నటుడు.” అన్నారు దర్శకుడు మారుతి. “ఈమధ్యకాలంలో నేను చూసిన మంచి సినిమా ఇది. ఒక జీవితాన్ని తెరపై చూసిన అనుభూతి కలిగింది.” అన్నారు డైరెక్టర్ గోపీచంద్ మలినేని.

Leave a comment

error: Content is protected !!