ప్రస్తుతం డిజిటల్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులెన్నో వస్తున్నాయి.   ఇప్పటికే పలు ఓటీటీ ప్లాట్ ఫామ్స్  డిజిటల్ వరల్డ్ ను శాసిస్తున్నాయి. అందుకే హీరో విజయ్ దేవరకొండ కూడా ఓటీటీ రంగంలోకి అడుగుపెట్టబోతున్నట్టు సమాచారం. త్వరలోనే ఆయన నిర్మాణ సంస్థ కింగ్‌ ఆఫ్‌ హిల్స్  నుంచి ఓ వెబ్‌సిరీస్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన అల్లు అరవింద్‌ ఓటీటీ ప్లాట్‌ఫాం ‘ఆహా’కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనికోసమే తాను కూడా కొన్ని వెబ్‌సిరీస్‌లను ప్లాన్‌ చేస్తున్నారట.

ఇప్పటికే ఓ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.   యువ దర్శకుడు కేవీఆర్‌ మహేంద్రతో దీన్ని తెరకెక్కించనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన గతంలో విజయ్‌ సోదరుడు ఆనంద్‌ దేవరకొండతో ‘దొరసాని’ చిత్రం తీసి మెప్పించారు. ఈ నేపథ్యంలోనే ఆయన టేకింగ్‌ స్టైల్‌ నచ్చి ఈ ప్రాజెక్టును ఆయనకు అప్పగించబోతున్నట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్‌ పూర్తికాగానే దీని వివరాలు అధికారికంగా బయటకు రానున్నాయి.

 

Leave a comment

error: Content is protected !!