టాలీవుడ్ రౌడీ హీరో  విజయ్ దేవరకొండ యూత్ ఫుల్ మూవీస్ తో  మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు. అర్జున్ రెడ్డి నుంచి డియర్ కామ్రేడ్ వరకు మంచి విజయాల్ని  సొంతం చేసుకుని ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు.

డిఫరెంట్  ఆటిట్యూడ్ తో ఆకట్టుకుంటున్న విజయ్ దేవరకొండ కు సోషల్ మీడియాలో వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అతి తక్కువ  కాలం లోనే తన స్టైల్ , ఆటిట్యూడ్ తో. దేశవ్యాప్తంగా క్రేజీ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ఆ ఫాలోయింగ్ మామూలుగా లేదు. తాజాగా సరికొత్త మైలు రాయిని దాటి రికార్డ్ సృష్టించాడు విజయ్. ఇన్ స్టా  గ్రామ్ లో 8 మిలియన్ ఫాలోవర్స్ ను సొంతం చేసుకుని సౌత్ ఇండియా లోనే ఈ ఘనతను సాధించిన తొలి హీరోగా నిలిచాడు.  80 లక్షల మార్కు దాటటం తో రౌడీ ఫాన్స్ సోషల్ మీడియాలో సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు.

 

Leave a comment

error: Content is protected !!