హీరో అవ్వాలని ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. కానీ ఎవరైతే తన కష్టాన్ని నమ్ముకొని అన్నిటినీ తట్టుకొని.. తన కోసం అవకాశాల్ని సృష్టించుకోగలుగుతాడో . అతడే నిజమైన హీరో. యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ ఆ కోవకు చెందిన వాడే. టాలీవుడ్ లో చిన్నచిన్నపాత్రలు పోషిస్తూ..  ఎప్పుడో స్ర్కీన్ మీద కనిపించాడు విజయ్ దేవరకొండ. అయితే ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చిత్రం అతడిలోని అసలైన టాలెంట్ ను వెలికితీసింది. ఆ తర్వాత ‘పెళ్ళిచూపులు’ చిత్రం విజయ్ దేవరకొండ ను హీరోగా టాలీవుడ్ లో బాగా ఎస్టాబ్లిష్ చేసింది. ఇక ‘అర్జున్ రెడ్డి’ చిత్రం గురించి చెప్పుకోనక్కర్లేదు. ఆ సినిమా విజయ్ దేవరకొండ కు ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చిపెట్టింది.  అందులో యారోగెంట్ డాక్టర్ గా , భగ్నప్రేమికుడిగా వేరియస్ యాంగిల్స్ లో తనదైన టాలెంట్ ను ప్రదర్శించి..  టాలీవుడ్ నిర్మాతలకు బంగారు కొండగా మారాడు విజయ్ దేవరకొండ.

విజయ్ దేవరకొండ కు ‘అర్జున్ రెడ్డి’తో వచ్చిన విపరీతమైన క్రేజ్ ను .. ‘గీతగోవిందం, టాక్సీవాలా’  చిత్ర విజయాలు ఎన్నో రెట్లు సస్టెయిన్ చేశాయి. ఎంతెలా అంటే.. ఆ తర్వాత విడుదలైన.. ‘నోటా, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రాలు ఘోరపరాజయమైనా.. విజయ్ దేవరకొండ కెరీర్ ను ఏమాత్రం ప్రభావితం చేయలేకపోయాయి. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఫైటర్’ అనే మూవీ లో బాక్సర్ గా నటిస్తున్నాడు విజయ్ . ఎప్పుడూ తన హీరోలకు డిఫరెండ్ క్యారెక్టరైజేషన్ ను రాసుకొనే పూరీ.. ఎప్పుడూ డిఫరెంట్ కేరక్టరైజేషన్స్ ను ఇష్టపడే విజయ్ దేవరకొండ ఇద్దరూ కొలాబరేట్ అవడం  ఆసక్తిని రేకెత్తిస్తోంది. నేడు విజయ్ దేవరకొండ బర్త్ డే . ఈ సందర్భంగా ఆ యువ సంచలనానికి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

హ్యాపీ బర్త్ డే విజయ్ దేవరకొండ

Leave a comment

error: Content is protected !!