Vettaiyan : సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘వేట్టైయన్’ దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తోంది. జై భీమ్‌ సినిమా తరహాలోనే.. కొన్ని వాస్తవ సంఘటనల్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రం రూపొందింది. రజనీకాంత్ ఈ చిత్రంలో ఓ నిజాయితీ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు.

అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్ వంటి ప్రముఖ నటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. రజనీకాంత్ పాత్ర చిత్రీకరణ ఇప్పటికే పూర్తయింది. ఇప్పుడు మొత్తం చిత్రీకరణను పూర్తి చేసుకుంది చిత్ర బృందం. ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్ని జరుపుకుంటోంది చిత్రం . మంజు వారియర్ తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పనులను పూర్తి చేసింది. అనిరుధ్ సంగీతం అందించిన ఈ చిత్రానికి ఎస్.ఆర్.కదీర్ ఛాయాగ్రహణం అందించారు. ‘వేట్టైయన్’ చిత్రం అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a comment

error: Content is protected !!