Vettaiyan : లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం వేట్టైయాన్. అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు. ఈ సినిమా సామాజిక సమస్యలను కళ్ళకు కట్టినట్లు చూపించనుందని దర్శకుడు టి.జె. జ్ఞానవేల్ తెలిపారు.

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. రజినీకాంత్, అమితాబ్ కలిసి నటించిన నాలుగో చిత్రం ఇది. మంజు వారియర్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, రితికా సింగ్, దుషరా విజయన్, రోహిణి, అభిరామి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రజినీకాంత్, లైకా ప్రొడక్షన్స్ కలిసి చేస్తున్న నాలుగో చిత్రం ఇది. రజినీకాంత్, అనిరుద్ రవిచందర్ కలిసి చేస్తున్న నాలుగో చిత్రం కూడా ఇదే.

ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం అద్భుతమైన సినిమాటిక్ అనుభవాన్ని అందించనుంది. సామాజిక సమస్యలపై దృష్టి సారించి తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది. అగ్ర తారలు, ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు ఈ చిత్రంలో పనిచేయడం ఈ చిత్రంపై భారీ అంచనాలను నెలకొల్పింది.

Leave a comment

error: Content is protected !!